ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్ గురించి విన్నారా.. ఇక ఇందులో చేరాలంటే..?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వస్తువులు, హోటళ్లు చాలా ఉంటాయి.అలాగే అత్యంత విలువైన పురాతన వస్తువులు చాలా ఉంటాయి.

ఇక పెద్ద పెద్ద స్టార్ హోటళ్లు అత్యంత ఖరీదైనవి ఉంటాయి.ఇక దుస్తులు, వాచ్ లు, ఫోన్ల లాంటివి కూడా అత్యంత ధర కలిగినవి ఉంటాయి.

అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్( expensive club ) గా క్లబ్ 33 ఉంది.ఈ క్లబ్ 33 అనేది డిస్నీలాండ్( Disneyland ) కి సంబంధించినది.దీనిలో సభ్యత్వం కోసమే ఎంట్రీ ఫీజు 50 వేల డాలర్లు ఉంటుంది.అంటే రూ.41.02 లక్షలు ఉంటుంది.ఇక వార్షిక ఫీజు 15 వేల డాలర్లు(రూ.12.30 లక్షలు) ఉంటుంది.1967లో ఈ క్లబ్ ను ఏర్పాటు చేశారు.ఈ క్లబ్ ను తర్వాతి కాలంలో చాలా ప్రాంతాలకు విస్తరించారు.

Advertisement

టోక్యో, షాంఘైతో( Tokyo , Shanghai ) పాటు ప్లోరిడాలోని డిస్నీ ల్యాండ్ పార్కులో శాఖలను ఏర్పాటు చేశారు.అత్యంత విలక్షణమైన డిన్నర్ క్లబ్బులలో ఇది ఒకటిగా పేరు తెచ్చుకుంది.

న్యూ ఆలీన్జ్ స్క్వేర్‌లోని 33 రాయల్ స్ట్రీట్‌లో( 33 Royal Street in New Orleans Square ) ఈ క్లబ్ ఉంటుంది.స్ట్రీట్ పేరు ఆధారంగా ఈ క్లబ్ కు ఆ పేరు పెట్టారు.అయితే హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా ఇక్కడ గడుపుతారు.

అత్యంత ఖరీదైన ఈ క్లబ్ లో పాపులర్ హాలీవుడ్ సెలబ్రెటీలు డిన్నర్ పార్టీలు చేసుకుంటారు.తొలుత డిస్నీలాండ్ కార్పొరేట్ స్పాన్సర్లకు మాత్రమే ఇందులోకి ఎంట్రీ ఉండేది.

కానీ వాల్ట్ డిస్నీ మరణం తర్వాత వీవీఐపీలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు.ఇందుకోసం ఎంట్రీ ఫీజును భారీగా పెట్టారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?

పెద్ద పెద్ద హాలీవుడ్ సెలబ్రెటీలు ఈ క్లబ్ ను సందర్శిస్తుండటంతో.అత్యంత ఖరీదైనదిగా పేరు తెచ్చుకుంది.

Advertisement

తాజా వార్తలు