వైరల్: రైలు పట్టాలకు నిప్పు పెట్టడం ఎప్పుడైనా చూసారా..?!

అధునాతన ప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు వెలువడ్డాయి.మెదడుకు మేతపెట్టి ఎన్నో కొత్త కొత్త టెక్నీక్ లు వాడుతున్నారు.

మనం ప్రమాదవశాత్తు రైళ్లకు మంటలు అంటుకోవడం చూస్తుంటాం.సాధారణంగా రైళ్లకు మంటలు అంటుకోవడం చూసుంటాం గానీ.

రైలు పట్టాలు కాలిపోవడం చూడడం చాలా అరుదు.అంతేకాక స్వయంగా రైల్వే సిబ్బందే రైలు పట్టాలకు మంటలు పెడతారని తెలుసా.? అమెరికాలోని చికాగోలో ఈ సంఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.

అమెరికా లోని చికాగో పరిసర ప్రాంతాల్లో డిసెంబర్ నుంచి చలి విపరీతంగా ఉంటుంది.రోడ్లపై మంచు కురుస్తుండడంతో.

Advertisement

వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.ఎక్కడబడితే అక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి.

అలా రైలు పట్టాలపై కూడా మంచు పడుతోంది.అలాంటి సమయంలో రైళ్లు నడిస్తే పట్టాలు విరిగిపోవడమో, లేదా పట్టాలు దూరంగా జరిగిపోయే ప్రమాదమో ఉంటుంది.

దీంతో రైల్వే సిబ్బంది డబుల్ కష్టాలు ఎదుర్కొంటున్నారు.రైళ్లు ఓ ట్రాక్‌ లోంచి మరో ట్రాక్‌ లోకి మారే కనెక్షన్ల వద్ద ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

దీంతో వాటిని తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడానికి చికాగో రైల్వే అధికారులు సరికొత్త ప్లాన్ వేశారు.పట్టాలకు నిప్పు పెడుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

నిప్పు పెట్టడంతో ఆ వేడికి రైలు పట్టాలపై మంచు కరిగిపోవడమే కాకుండా రైళ్ల రాకపోకలు సాఫీగా సాగుతాయి.ఇలా మంటలు పెట్టేటప్పుడు సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు.రైలు పట్టాలకు నిప్పు పెడుతున్న నిర్వహణ సిబ్బంది ప్రస్తుతం ఒక్కో షిఫ్టులో 12 గంటలపాటు పనిచేస్తూ పట్టాలకు మంట పెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.కాగా, ఆర్కిటిక్ నుంచి వీస్తున్న చల్లటి గాలులకు మిన్నెసోటా, డకోటా, ఇల్లినాయిస్‌, గ్రేట్‌ లేక్స్‌, మిన్నెపోలీస్‌, డెట్రాయిట్‌, షికాగో తదితర ప్రాంతాల ప్రజలు చలికి తెట్టుకోలేకపోతున్నారు.

తాజా వార్తలు