త్వరలో వైసీపీకి చెందిన ఇద్దరు సినీ నటులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు.ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పటి నుంచి , ఆ పార్టీ తరఫున మాట్లాడుతూ , రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ, ప్రతి దశలోనూ అండగా నిలుస్తూ వచ్చారు.
సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణ మురళి.ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానికి కీలక దక్కుతుందని అంత అంచనా వేశారు.కానీ ఆయనకు ఏ పదవి దక్కలేదు.కానీ సినీ నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ కు మాత్రం ఎస్వీ బీసీ చైర్మన్ పదవిని అప్పగించారు. అయినా పోసాని అసంతృప్తి చెందకుండా, పార్టీకి అండగా ఉంటూనే వస్తున్నారు.కానీ తన సన్నిహితులు వద్ద మాత్రం తనకు పదవి దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండేవారట.2019 ఎన్నికల సమయంలో వైసిపిలో చేరి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన సినీ నటుడు ఆలీ కీలక పదవుల పైనే ఆశలు పెట్టుకున్నారు.
ఒక దశలో ఆయనకు కీలకమైన పదో ఒకటి దక్కబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే అది కార్య రూపం దాల్చలేదు .వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా, పదవులు దక్కకపోవడంతో పోసాని, ఆలీ అసంతృప్తితో ఉన్నారు .దీంతోపాటు సినీ రంగం నుంచి వైసీపీకి అండగా ఉంటున్న వారిలోనూ ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తుండడం , వైసిపి కి మద్దతు పలికినా, తమకేమీ ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయం కలగడం , సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలో ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలు అన్నిటిని పరిగణలోకి తీసుకున్న జగన్ ఆలీకి పోసానికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.వాస్తవంగా ఆలీ రాజ్యసభ సభ్యత్వం ఆశించారు.
అది దక్కకపోతే క్యాబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పోస్ట్ దక్కుతుందని అంచనా వేశారు.

ఒకదశలో వక్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరిగింది కానీ ఏదీ కేటాయించకపోవడం వంటి పరిణామాలతో ఆలీ సైతం అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని గుర్తించిన జగన్ … ఆలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారిగా నియమించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం .కానీ ఆలీ మాత్రం ఇంకా పెద్ద పదవి పైనే ఆశలు పెట్టుకున్నారట.ఈ మేరకు వైసిపి అధిష్టానానికి తన మనసులో మాటను చెప్పారట.
ఇక పోసాని కృష్ణ మురళికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే సినీ పరిశ్రమ వైసిపికి వ్యతిరేకంగా ఉందని నివేదికలందుతున్న నేపథ్యంలో సినీ రంగానికి చెందిన వారికి కీలక పదవులు కట్టబెట్టి వారి ప్రాధాన్యాన్ని పెంచాలని జగన్ నిర్ణయించుకోవడంతో ఆలీకి , పోసానికి మరికొద్ది రోజుల్లోనే కీలకమైన నామినేటెడ్ పోస్టులు దక్కపోతున్నట్లు సమాచారం.