అమెరికాలో విద్వేష నేరాలకు బాధితులుగా సిక్కులు..యూదుల తర్వాత మనోళ్లే, భయపెడుతోన్న గణాంకాలు..!!

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

 Hate Crimes Against Sikhs On The Rise In America, Us Federal Bureau Of Investiga-TeluguStop.com

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో సిక్కులపై విద్వేష నేరాలు ఎక్కువవుతున్నాయి.ఇటీవలి కాలంలో పలు సంస్థలు విడుదల చేసిన నివేదికల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అమెరికాలో యూదుల తర్వాత అత్యధికంగా విద్వేష నేరాలకు గురయ్యేది సిక్కులేనట.

Telugu Al Qaeda, America, Bin Laden, Hatecrimes, Jews, Muslims, Sikhs, Federal B

2018లో యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అందిన ఫిర్యాదుల్లో సిక్కులపై జరిగిన ద్వేషపూరిత నేరాలు 60 కాగా.2020లో ఈ సంఖ్య 89కి పెరిగింది.2021లో అత్యధికంగా 214కు చేరడం సమస్య తీవ్రతగా అద్ధం పడుతోంది.విద్వేష నేరాలకు సంబంధించి 2018లో అమెరికాలో యూదులు, ముస్లింల తర్వాత సిక్కులు వుండేవారు.అయితే ఇప్పుడు అనూహ్యంగా సిక్కులు రెండవ స్థానంలోకి చేరారు.ఎఫ్‌బీఐ ప్రకారం.అమెరికాలో ఇతర మతాలకు వ్యతిరేకంగా 91 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.

ఇందులో హిందువులపై 12, బౌద్ధులపై 10 నేరాలు జరిగాయి.

Telugu Al Qaeda, America, Bin Laden, Hatecrimes, Jews, Muslims, Sikhs, Federal B

కాగా.2001 సెప్టెంబ‌రు 11న అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ పైన బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు జ‌రిపిన దాడులు తర్వాత ముస్లింలు, దక్షిణాసియా వాసులు, సిక్కులపై విద్వేషదాడులు పెరిగిపోయాయి.భౌతిక దాడులతో పాటు వారిని చంపేందుకు కూడా అమెరికన్లు వెనుకాడలేదు.

వారిపై ఉగ్రవాదులని, ప్రమాదకరమైన వ్యక్తులనే ముద్ర వేసి స్థానికులే అవహేళన చేసేవారు.అయినప్పటికీ అవమానాలు భరిస్తూనే సిక్కులు అగ్రరాజ్యంలో కాలం వెళ్లదీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube