గిఫ్ట్ ప్యాక్ లు మరియు గ్రీస్ డబ్బాలో కొత్త ప్లాన్ తో హాష్ ఆయిల్ ని అక్రమ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా లో ఇద్దరిని హయత్ నగర్ మరియు ఎల్ బి నగర్ జోన్ ఎస్ ఓ టి పోలీస్ లు అరెస్ట్ చేయటం జరిగింది,నిందితుల వద్ద 15 లక్షల విలువైన 4 లీటర్ల హాష్ ఆయిల్ మరియు 3 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది, మరో ఇద్దరు నిందితులు సంతోష్ సంజీవ రావు లు పరారీలో ఉన్నారు,కోన శివ, నూక రాజు, సంతోష్ కుమార్, సంజీవ్ రావు ముఠా గా ఏర్పడి హాష్ ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు,ముఠా లోని సభ్యులు అందరు ఆంద్రప్రదేశ్ కు చెందిన వారు.కొన శివ విద్యార్థి మరియు అతని మిత్రుడు పప్పు నూకరాజు 40 వేల రూపాయల డబ్బుకోసం వైజాగ్ నుంచి హాష్ ఆయిల్ ను హైదరాబాద్ కి తరలించి అవసరం ఉన్న కస్టమర్ లకి అమ్మే క్రమం లో హయత్ నగర్ బాగ్యలత వద్ద అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి మహేష్ బఘవత్ మీడియా కి తెలిపారు.
తాజా వార్తలు