టైమ్స్ మ్యాగజైన్ లో ఇండో అమెరికన్ కి చోటు....!

ప్రపంచంలోనే ప్రఖ్యాత మ్యాగజైన్ గా పేరొందిన టైమ్స్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులని ఎప్పటికప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

వారి ఎదుగుదల సాధించిన విజయాలు తదితర అంశాలపై ఓ వ్యాసాన్ని ఇస్తుంది.

అయితే ఈ సారి ఈ టైమ్స్ ప్రకటించిన సుమారు 100 ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు స్థానం దక్కించుకున్నారు.ఈ జాబితాలో మొత్తం ముగ్గురు భారతీయులకి స్థానం దక్కింది.

వీరిలో ఇద్దరు మహిళలు ఉండటం మరొక విశేషం.ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మెన్ ముకేష్ అంబానీ , స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ న్యాయవాదులు అరుంధతి కట్టూ, మరియు మేనకా గురుస్వామి ఈ జాబితాలో ఉన్నారు.

వీరితో పాటుగా ఇండో అమెరికన్ హాస్యనటుడు , టీవీ హోస్ట్‌ హసన్‌ మిన్హాజ్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పోప్‌ ప్రాన్సిస్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఫేస్‌బుక్‌ సృష్టికర్త అయిన జుకర్‌బర్గ్‌ లు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

Advertisement

తప్పించుకుంటూ అధికారులనే కారుతో ఢీకొట్టి .. భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు