యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.
ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ గత వారమే విడుదల అయినా విషయం తెలిసిందే.ఈ రాతలే సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది.
ఇక ఈ సాంగ్ కు ప్రముఖ గీత రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు.ఈ పాట కంటే ఎక్కువగా లిరికల్ సాంగ్ వీడియోలో ఉన్న గ్రాఫిక్స్ అందరిని ఆకట్టు కున్నాయి.
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూ లో కృష్ణకాంత్ ఈ పాట గురించి మాత్రమే కాదు రాధే శ్యామ్ కథ గురించి కూడా రివీల్ చేసాడు.ఈ ఇంటర్వ్యూ లో కృష్ణకాంత్ మాట్లాడుతూ.

”ఈ సినిమా 1970 లో యూరప్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ అని తెలిపాడు.ఇంకా సినిమా మొత్తం రైలు ప్రయాణంలో జరుగుతుంది అని కొందరు అనుకుంటున్నారు.మరి కొంతమంది ఈ సినిమా టైం ట్రావెల్ సినిమా అని.పునర్జన్మ ఆధారంగా తెరకెక్కే సినిమా అని అందరు ఉహించు కుంటున్నారు.కానీ నేను ఈ సినిమా స్టోరీ గురించి పెద్దగా బయట పెట్టను.ఎందుకంటే సస్పెన్స్ అలాగే ఉండాలి అని గీత రచయిత కృష్ణకాంత్ తెలిపారు.

ఇంకా రాధేశ్యామ్ లో నేను 5 పాటలు రాసాను.ఈ రాతలే పాట వినడానికి కష్టంగా అనిపించవచ్చు.కానీ ఈ పాటను థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద చుస్తే మీకు ఇంకా బాగా అర్ధం అవుతుంది.నిజానికి ఈ రాతలే సాంగ్ ద్వారానే మేము చాలా కథను చెప్పేసాము.
అర్ధం చేసుకో గలిగితే ఈ సాంగ్ చూస్తేనే సినిమా స్టోరీ మొత్తం అర్ధం చేసుకోవచ్చు.అంటూ ఆయన స్టోరీ మొత్తం ఈ సాంగ్ లోనే ఉందని చెప్పకనే చెప్పేసాడు.