సింగర్ దారుణ హత్య.. ఆమె ప్రాణాలు తీసేముందు నిద్రమాత్రలు కలిపి?

ఢిల్లీకి చెందిన సింగర్ దివ్య ఇండోర్ అలియాస్ సంగీత ఈనెల 11వ తేదీన కనిపించకుండా పోయి ఆపై మూడు రోజుల తర్వాత రోహ్ తక్ సమీపంలో శవమై కనిపించిన విషయం తెలిసిందే.అయితే ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

 Haryanvi Singer Sangeeta Given Ten Sleeping Pills Before Death Details, Singer,-TeluguStop.com

అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె స్నేహితులు అయిన రవి, అనిల్ ను తాజాగా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.అయితే ఈ విచారణలో భాగంగా ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్లాన్ ప్రకారమే సంగీతను దారుణంగా హత్య చేశారని తెలిపారు.

అంతేకాకుండా చంపడానికి ముందు ఆమెకు 10 నిద్ర మాత్రలు కూడా ఇచ్చినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించాడు అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం సంగీత హత్య సంఘటనలో సూత్రధారి రవి అని విచారణలో వెల్లడైందని,అతడి సూచన మేరకు అనిల్‌ ఢిల్లీకి వచ్చి మృతురాలిని కారులో ఎక్కించుకుని వచ్చాడని, మెహం వైపు వెళుతుండగా దారిలో మధ్యలో అనిల్ చెరుకు రసంలో ఆమెకు 10 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చాడని పోలీసులు తెలిపారు.హర్యానాలోని కలనౌర్‌ దగ్గరికి రాగానే రవి వారిని కలిశాడట.

Telugu Anil, Delhi, Divya Indore, Haryanvi, Ravi, Sangeetha, Sangeeta, Pills-Mov

ఆ తర్వాత ముగ్గురు కలిసి అక్కడే సమీపంలోని గులాటి దాభాలో భోజనం చేసి,మెహం సమీపానికి రాగానే సంగీత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో దీంతో ఆమె స్నేహితుడు రవి ఆమె పీక నులిమి హత్య చేశాడట.ఆ తర్వాత మెహం ప్రాంతంలో పాతి పెట్టినట్టు నిందితులు తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు.కాగా రిలేషన్‌లో వచ్చిన మనస్పర్థల కారణంగానే ఈ హత్య జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube