హార్వర్డ్ కుబేరుల వికృత చేష్టలు.. డబ్బును ఇలాగే తగలేస్తారా.. వీడియో లీక్!

ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల్లో హార్వర్డ్‌ యూనివర్సిటీ( Harvard University ) ఒకటని చెప్పవచ్చు.ఇందులో సీటు సంపాదించడం అంత తేలికేం కాదు.

దాదాపు 4% కంటే తక్కువ అడ్మిషన్ రేటుతో, కొద్దిమంది అదృష్టవంతులకే అక్కడ ప్రవేశం దక్కుతుంది.అయితే, చాలా మంది ధనవంతుల పిల్లలకు( Wealthy Students ) హార్వర్డ్ లాంటి ఐవీ లీగ్ స్కూళ్లలో సులువుగా సీటు వస్తుందనే ఒక నమ్మకం బలంగా ఉంది.

ఎందుకంటే, వాళ్ల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లు, ఖరీదైన కోర్సులు, అప్లికేషన్‌ను బలంగా మార్చే ఇతర వనరులను సమకూర్చుకోగలరు మరి.హార్వర్డ్‌లో చాలా మంది డబ్బున్నవాళ్లు ఉంటారనేది రహస్యమేమీ కాదు.అయితే, తాజాగా కొంతమంది స్టూడెంట్స్ అక్కడి కుబేరులు తమ డబ్బును ఎలా విచ్చలవిడిగా ఖర్చు పెడతారో షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆష్టన్ హెర్ండన్ హార్వర్డ్ స్టూడెంట్స్‌ను( Harvard Students ) క్యాంపస్‌లో వాళ్లు చూసిన రిచెస్ట్ విషయాల గురించి అడిగారు.వాళ్లు చెప్పిన సమాధానాలు విస్తుపోయేలా ఉన్నాయి.ఒక స్టూడెంట్ మాట్లాడుతూ.

Advertisement

ఒక కుర్రాడిని ఏ ఎయిర్‌లైన్‌లో వెళ్తావని అడిగితే, "మా నాన్నగారిది" అని చెప్పాడట.మరొకరు అయితే, క్లాస్‌కు కొన్ని గంటల ముందు ఒక స్టూడెంట్ ప్రైవేట్ జెట్‌లో సెల్ఫీ దిగి పోస్ట్ చేయడం చూశానన్నారు.

ఇంకో స్టూడెంట్ అయితే.వీకెండ్‌లో సరదాగా యూరప్‌కు ఫ్లైట్‌లో వెళ్లే తన రిచ్ క్లాస్‌మేట్స్ గురించి చెప్పాడు.అంతేకాదు, క్యాంపస్ బిల్డింగ్‌ల పేర్లే ఇంటి పేర్లుగా ఉన్న స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్నారని తెలిపాడు.

అంటే వాళ్ల కుటుంబాలకున్న డబ్బు, పలుకుబడి అలాంటివన్నమాట.హార్వర్డ్ లెగసీ అప్లికెంట్స్‌కు, భారీగా డొనేషన్లు ఇచ్చేవాళ్లకు లేదా బిల్డింగ్స్ కట్టించేవాళ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని అందరికీ తెలిసిందే.

ఇంకొందరు స్టూడెంట్స్ అయితే ఒకేసారి చాలా కార్టియర్ లవ్ బ్రాస్‌లెట్స్ పెట్టుకుని తిరుగుతారట.ఒక్కో బ్రాస్‌లెట్ ధర దాదాపు రూ.5 లక్షలు ఉంటుంది.ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది.ఇప్పటివరకు 4.5 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది.చాలామంది నెటిజన్లు హార్వర్డ్ ధనవంతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శిస్తున్నారు.

రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను .. మరో షాకిచ్చిన జస్టిన్ ట్రూడో

అది తెలివైనవాళ్ల స్కూల్ కాదని, కేవలం డబ్బున్నవాళ్ల స్కూల్ అని కామెంట్ చేస్తున్నారు.డబ్బుంటే ఏదైనా సాధ్యమేనా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు