మాస్ మహారాజా రవితేజ( Ravi teja ) స్పీడ్ ను ఏ హీరో కూడా తట్టుకోలేడు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.
అయితే ప్రజెంట్ ఈయన ఈ మధ్యన ప్రకటించిన సినిమాలన్నీ పూర్తి అయ్యాయి.చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది.
అందుకే ఈయన లైనప్ లో మళ్ళీ కొత్త కొత్త డైరెక్టర్ల పేరులు వినిపిస్తున్నాయి.అందులో ముందుగా వినిపించే పేరు హరీష్ శంకర్( Harish shankar ).

కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రాజాతో ఇప్పటికే మిరపకాయ్( Mirapakay movie ) వంటి సినిమాను చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.మరి ఈ కాంబోలో మరో మూవీ రాబోతుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది.ఈ మధ్యనే హరీష్ చిట్ చాట్ లో రవితేజతో సినిమా ఉంటుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈ పనిలోనే ఉన్నట్టు తెలుస్తుంది.
రవితేజ కోసం హరీష్ ఒక కథ రెడీ చేసి ఆయనకు వినిపించాలని ప్లాన్ చేస్తున్నాడట.త్వరలోనే ఆయనను కలిసి వినిపించనున్నాడట.
మరి రవితేజ కోసం హరీష్ ఎలాంటి కథను రాస్తాడో ఎప్పుడు కలిసి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.ఇక ప్రజెంట్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagath Singh ) సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇది పూర్తయితే కానీ వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉంది.ఇక మాస్ రాజా సినిమా విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.