బహుముఖ వ్యూహంతో హరీష్ రావు... మరి వ్యూహం ఫలించేనా?

తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు పరిచయం అక్కరలేని పేరు.అయితే ట్రబుల్ షూటర్ గా హరీష్ రావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే.

అయితే టీఆర్ఎస్ ఎప్పుడు కష్టకాలంలో ఉన్నా హరీష్ రావు అస్త్రాన్ని కెసీఆర్ ప్రయోగిస్తాడన్న విషయం మనకు తెలిసిందే.ఇక అందరూ ఊహించినట్టుగానే హుజురాబాద్ ఉప ఎన్నిక మంత్రి హరీష్ రావు సారధ్యంలోనే నడుస్తున్నది.

అయితే హరీష్ రావు తనకున్న రాజకీయ చతురతను మొత్తం హుజురాబాద్ లో వినియోగిస్తున్న పరిస్థితి ఉంది.అయితే హరీష్ రావు ఒక దుబ్బాకలో మినహా ఎక్కడా హరీష్ రావు వ్యూహం విఫలమైన దాఖలాలు లేవు.

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందటం టీఆర్ఎస్ కు చాలా అవసరం ప్రతిష్టాత్మకం కూడా.అయితే ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ లను ప్రకటించి కెసీఆర్ వారి వారికిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.

Advertisement

అయితే హరీష్ రావు మాత్రం టీఆర్ఎస్ ను విజయ తీరాలకు చేర్చాలనే ఉద్దేశ్యంతో బహుముఖ వ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు.అయితే ఇప్పటికే అన్ని రకాల కులసంఘాలతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకొని అందులో కొన్నింటిని పరిష్కారం చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది.

అయితే ఎవరితో అయితే భేటీ అయ్యారో వారిని టీఆర్ఎస్ వైపు ఉండే విధంగా ప్రయత్నిస్తూ టీఆర్ఎస్ కు అనుకూలంగా లేని వారిని టీఆర్ఎస్ వైపు మళ్ళిస్తూ బీజేపీని బలహీనపరిచేలా వ్యూహం పన్నుతున్నారు మంత్రి హరీష్ రావు.

ఇప్పటికే ఎక్కువ ఓటు శాతం ఉన్న మండలాల్లో హరీష్ రావు ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు సమాచారం.అయితే ఇప్పటికే కార్యకర్తలకు కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు మాత్రం ఎట్టి పరిస్థితిలలోనూ ఇతర పార్టీలకు మళ్లకూడదు హరీష్ రావు దిశానిర్ధేశం చేసినట్టు తెలుస్తోంది.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు