హరీష్ రావు కు మంత్రి పదవి ఏ శాఖ ఇస్తున్నారంటే ?

సోషల్ మీడియా పుణ్యమా అని తెలంగాణాలో టీఆర్ఎస్ నాయకుడు, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇటీవల తెలంగాణాలో అతి భారీ ప్రాజెక్ట్ గా పేరుపడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యింది.

ఆ కార్యక్రమానికి అతిరధమహారాదులంతా హాజరయ్యారు.కానీ ఆ ప్రాజెక్ట్ కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డ హరీష్ రావు హాజరు కాలేదు.

అంటే ఆయనకు అసలు ఆహ్వానమే అందలేదు.కేసీఆర్ కావాలనే హరీష్ ను అవమానించడానికే అలా చేశారని ప్రచారమూ జరిగింది.

అయితే దీనిపై ప్రచారమాధ్యమాల్లో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.హరీష్ ను కేసీఆర్ కావాలనే వాడుకుని వదిలేశాడని, కేసీఆర్ నైజం ఇంతే అంటూ రకరకాల కామెంట్స్ కూడా వచ్చాయి.

Advertisement

దీంతో ప్రాజెక్ట్ ఓపెనింగ్ క్రెడిట్ కన్నా, హరీష్ మీద సానుభూతి అందరిలోనూ పెరిగిపోవడం కేసీఆర్, కేటీఆర్ కు బాగా ఇబ్బందికరంగా మారింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కేసీఆర్ తన మంత్రి వర్గంలో మార్పు చేర్పులు చేయాలని చూస్తున్నాడు.గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించి.తెలంగాణకు వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ నెల రోజుల వరకు తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు.

సంక్రాంతికి కొద్దీ మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేసిన కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గాన్ని పూర్తిగా విస్తరించాలనుకున్నారు.అయితే కేసీఆర్ ఊహించిన దానికి భిన్నంగా టిఆర్ఎస్ కేవలం తొమ్మిది సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది.

ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్‌లో మహిళా మంత్రులు లేరని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది.టిఆర్ఎస్ నుంచి అనేకమంది మహిళా ఎమ్మెల్యేలు గెలిచినా కేసీఆర్ వారికి కాదని కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారి టిఆర్ఎస్‌లోకి జంప్‌ చేసిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తన కేబినెట్లో స్థానం కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు కేసీఆర్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

అయితే హరీష్, సబితతో పాటు కేటీఆర్ ను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడు.సబితకు ఏ శాఖ కేటాయిస్తారో తెలియదు కానీ, కేటీఆర్‌కు మాత్రం గతంలో ఆయన నిర్వహించిన ఐటీ శాఖనే కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

కానీ హరీష్ రావుకు గతంలో ఆయన నిర్వహించిన భారీ నీటిపారుదల శాఖకు బదులుగా విద్యా శాఖ కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నాడట.ప్రస్తుతం జగదీష్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

అయితే ఆ శాఖను తీసుకునేందుకు హరీష్ రావు , ఒప్పుకుంటాడా లేక గతంలో తాను నిర్వహించిన భారీ నీటి పారుదల శాఖను కేటాయించాలని పట్టుబడతాడా అనేది తేలాల్సి ఉంది.ఏది ఏమైనా కేసీఆర్ చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణ కొన్ని అనవసర తలపోట్లకు కారణమయ్యి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం మాత్రం ఖాయం.

తాజా వార్తలు