తెలుగు బిగ్ బాస్ ఫైనల్ కు మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.ఈ వారం ముగిసింది.
మరో మూడు వారాలు మాత్రమే ఉండబోతుంది.ఈ మూడు వారాల్లో ఎవరు ఉంటారు ఎవరు ఫైనల్ 5 లో నిలుస్తారు అనే విషయం లో క్లారిటీ లేదు.
అయితే ఫైనల్ 5 లో ఉండే వారిలో ఒకరు కన్ఫర్మ్ అయినట్లుగా అనిపిస్తుంది.బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్‌లో రేస్ టు ఫినాలే మొదలు అయ్యింది.
అందులో భాగంగా ఇప్పటి వరకు ఉత్తమ కెప్టెన్ ఎవరు అనే విషయాన్ని ఎంపిక చేసుకోవాలి.అలాగే వరస్ట్ కెప్టెన్ ఎవరు అనే విషయాన్ని కూడా అంతా నిర్ణయించుకుని ఏకాభిప్రాయంతో బిగ్ బాస్ కు తెలియజేయండి అంటూ ప్రకటన వచ్చింది.
ఆ సమయంలో ఎక్కువ మంది హారిక కెప్టెన్సీ బెటర్ అంటూ క్లారిటీ ఇచ్చారు.ఇక బిగ్ బాస్ సీజన్ 4 వరస్ట్ కెప్టెన్‌గా అరియానాను అంతా నిలబెట్టారు.
ఆమె వల్ల చాలా ఇబ్బందులు పడ్డానంటూ సోహెల్ నిర్మొహమాటంగా చెప్పాడు.

ఉత్తమ కెప్టెన్‌గా ఎంపిక అయినందుకు దేత్తడి హారికకు ఫైనల్ కు డైరెక్ట్‌గా ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది.బిగ్ బాస్ లో ఏదైనా జరుగవచ్చు కనుక హారిక స్థానంలో అరియానా అయినా రేస్ టు ఫినాలే ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది అనిపిస్తుంది.మొత్తానికి ఎలా అయినా బిగ్ బాస్ రేస్ టు ఫినాలేలో వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉందని అంటున్నారు.
అయితే ఫినాలే కనుక ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారినే ఫినాలే పోరుకు ఎంపిక చేసే అవకాశం ఉందంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ ఫైనల్ 5 లో నిలువబోతున్న మొదటి కంటెస్టెంట్‌గా దేత్తడి హారిక ఉంటుందని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ వంటి బిగ్గెస్ట్ ప్లాట్‌ఫామ్ మీద ఫైనల్ 5 లో నిలవడం కూడా మామూలు విషయం కాదు.అక్కడకు వెళ్లారు అంటే వారు విజేతలే అన్నట్లుగా ప్రేక్షకులు భావిస్తున్నారు.
అందుకే హారిక ఒక విజేతగా నిలిచినట్లే అంటూ అభిమానులు ఆనందంతో గెంతులు వేస్తున్నారు.