ఇన్నాళ్లూ ఒక ఎత్తు.. ఫైనల్‌ మ్యాచ్‌ మరో ఎత్తు.. అంటున్న హార్దిక్.!

నేటితో ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి కానుంది.నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు మొదలయ్యే ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి.

గత యాభై రోజుల నుంచి భారతదేశంలో క్రికెట్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని, వినోదాన్ని అందిస్తూ వచ్చింది ఐపీఎల్ 2020.ఈ సందర్భంగా తాజాగా ముంబై ఆటగాడు హార్థిక తమ జట్టుకు మద్దతును కూడగట్టేందుకు అతడు ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియోను షేర్ చేశాడు.నిజానికి ఈ వీడియో కాస్త స్ఫూర్తిదాయకంగా కనబడుతోంది.

ప్రాక్టీస్, ఫిట్నెస్ కు సంబంధించి ఎంత కష్టపడుతున్నారో తెలియజేసే వీడియో ఇది.ఇకపోతే ఈ వీడియోకి హార్దిక్ పాండ్యా ఇన్నిరోజులు ఒక ఎత్తు.ఫైనల్ మ్యాచ్ మరో ఎత్తు.

మా సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం వచ్చిందని క్యాప్షన్ పెట్టాడు.ఇకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో 14 మ్యాచుల గాను 9 మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు ముంబై ఇండియన్స్ జట్టు.

Advertisement

ఆ తర్వాత క్వాలిఫైయర్ 1 మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్ గా ఆడి ఆరోసారి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.ఇప్పటికే నాలుగు సార్లు విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఐదవ సారి కప్పును గెలవడానికి సిద్ధమైపోయింది.

ఇదివరకు ముంబై ఇండియన్స్ సెట్ 2013, 2015, 2017, 2019 నెలలో టైటిల్ గెలుచుకొని అత్యధికంగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా పేరు సంపాదించుకుంది.ఇక ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యర్థిగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆడనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది.దీంతో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కప్ గెలుచుకుని ఢిల్లీ క్యాపిటల్స్ కు మొట్టమొదటిసారిగా టైటిల్ ను అందించాలని శ్రేయస్ అయ్యర్ సేన గట్టి పట్టుదలతో ఉంది.

క్వాలిఫైయర్ 2 లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించి తుది పోరులో ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది ఢిల్లీ క్యాపిటల్స్.ఇకపోతే ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మొత్తం మూడుసార్లు ఓడిపోయింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

లీగ్ దశలో రెండుసార్లు ఓడిపోగా, క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై చేతిలో ఓటమిపాలైంది.చూడాలి మరి ఈసారైనా ముంబై ని ఓడించి టైటిల్ ను గెలుచుకున్న కొత్త జట్టుగా అవతరిస్తుందో లేదో.?.

Advertisement

తాజా వార్తలు