ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్య..!

హార్దిక్‌ పాండ్య కెరీర్‌లో చాలా విజయాలను చూశాడు.అయితే అతడు ఫామ్‌ను కోల్పోయి గత కొన్ని మ్యాచ్‌ల్లో సరిగా ఆడలేకపోయాడు.

దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి.అయితే ఇప్పుడు 2022 ఐపీఎల్‌లో మళ్లీ ఆల్ రౌండర్‌గా తన సత్తా చాటుతూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.

పాండ్య గుజరాత్‌ టైటాన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.డెబ్యూ సీజన్‌లోనే గుజరాత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లగలిగాడు.

ఈ సందర్భంగా మీడియా అతన్ని ప్రశ్నలు అడిగింది.ఇందులో భాగంగా ఆతడు చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Advertisement

కెరీర్‌లో ఎదురయ్యే ఆటుపోట్లను, జయాపజయాలను చిరునవ్వుతోనే స్వీకరిస్తానని తాజాగా పాండ్య చెప్పుకొచ్చాడు. లోకులు కాకులు అంటారు.

జనాలు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడతారనేది కాదనలేని నిజం.అది తప్ప వారికి ఇంకేం పనుంది.

వారి విషయంలో మనం చేసేది ఏమీ లేదు.ఎవరేం మాట్లాడినా హార్దిక్‌ పాండ్య పేరు ఏ సమయంలోనైనా అమ్ముడుపోతుంది.

అందుకే విమర్శల వల్ల నాకెలాంటి ఇబ్బంది రాదు.వాటన్నింటికీ చిరునవ్వే సమాధానంగా ఇస్తా.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

నా లైఫ్‌లో ధోనీ అన్న కీలకపాత్ర పోషించాడు.నాకు అతడు ఒక డియరెస్ట్ బ్రదర్ లాంటి వాడు.

Advertisement

మంచి స్నేహితుడు.అలాగే నాకు ఓ కుటుంబ సభ్యుడు లాంటోడు.

ధోనీ నుంచి ఎన్నో మంచి విషయాలు నేను నేర్చుకున్నాను." అని విమర్శలతో పాటు ధోనీ గురించి పాండ్య చెప్పుకొచ్చాడు.

కెప్టెన్సీ చేపట్టక ముందు కూడా ఒక కెప్టెన్ లాగా అన్ని విషయాలను నిశితంగా పరిశీలించే అలవాటు తనకు ఉందని పాండ్య తెలిపాడు.క్రికెట్ విషయానికొస్తే ఎలాంటి హడావుడి లేకుండా 10 సెకన్లు లేట్ అయినా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం అని హార్దిక్ పేర్కొన్నాడు.

తాజా వార్తలు