పాపం హన్సిక.. నేను ధనవంతుడిని నన్ను పెళ్లి చేసుకో అంటూ హింస.. ఆమె ఏం చేసిందంటే?

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ హన్సిక పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.

తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తో తన నటనతో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే హన్సికను ఓ అభిమాని బాగా టార్చర్ చేశాడట.2001లో సినీ ఇండస్ట్రీకి హన్సిక బాలనటిగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించింది.బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో కూడా నటించింది.

ఇక 2007లో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.ఈ సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ లతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది.ఇక ఈమె వ్యక్తిగతం పట్ల మంచి పేరు సంపాదించుకుంది.

Advertisement

చాలా వరకు ఎంతో మంది అనాధలకు కడుపు నింపింది.కొంతమంది అనాధ పిల్లలను కూడా దత్తత తీసుకుంది.

ఇదిలా ఉంటే ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.గతంలో ఓ అభిమాని మాత్రం బాగా టార్చర్ చేశాడట.

కొన్ని ఏళ్ళ కిందట తను హిందీ సినిమాలో నటించగా ఆ సినిమాలో తన పాత్ర సీరియల్ నటి గా ఉందని బాగా విమర్శలు వచ్చాయి.దీంతో ఆమె డబ్బుల కోసం విచిత్రమైన పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని కామెంట్లు కూడా చేశారు.

ఇక ముంబైకి చెందిన ఓ అభిమాని హన్సిక ఈమెయిల్ ఐడి ని కనుక్కొని ఆమెకు ప్రతిరోజు మెయిల్స్ పంపుతూ బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని తెలిసింది.ఆమె సినిమాల్లో ఆమె పాత్ర గురించి కూడా బాగా మెయిల్స్ పెట్టాడట.అంతేకాకుండా హన్సిక కు డబ్బు పిచ్చి ఉండటంతో.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తనతో అడ్జస్ట్ అవ్వచ్చని పెళ్లి చేసుకుందాము అని.తన దగ్గర చాలా ఆస్తి ఉందని ధనవంతుడినని పెళ్లి చేసుకో అంటూ దారుణంగా హింసించి ​రకరకాలుగా మెయిల్స్ పెట్టి తనను బాగా ఇబ్బంది పెట్టాడట.అంతేకాకుండా ఓ రోజు ఫలానా ప్రాంతంలో నీ గురించి ఎదురు చూస్తాను అంటూ పెట్టడంతో వెంటనే హన్సిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకుందట.

Advertisement

​ఇక మళ్లీ పెద్ద గొడవ జరుగుతుందేమో అని భయపడి తన సన్నిహితుల సలహాలతో మెయిల్ ఐడి మార్చుకుందని తెలిసింది.ఇదంతా గతం లో జరుగగా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని కానీ వాటిని భరించడం చాలా కష్టం అని గతంలోని తెలిపింది.ఇప్పటికీ కొంతమంది వీరాభిమానులు తమ అభిమాన హీరోయిన్లపై అభిమానం పెంచుకుని కొన్ని కొన్ని షాకింగ్ సర్ ప్రైజ్ లు కూడా ఇస్తుంటారు.

ఇక హన్సిక ఈ ఏడాది 105 మినిట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గతంలో ప్రకటించింది.కానీ మళ్లీ ఈ సినిమా గురించి ఎటువంటి ప్రకటన లేదు.

తాజా వార్తలు