పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన చిత్రం దేశముదురు ( Desamuduru )ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.అప్పట్లో ఈ సినిమా ఈ సినిమాలోని పాటలు ఓ రేంజ్ లో మారుమోగిపోయాయి.
ఇప్పటికి ఈ సినిమాలో పాటలు ఎక్కడైనా వినిపించిన మనకు తెలియకుండానే డాన్స్ చేస్తుంటాము.అంతలా ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను మెప్పించాయని చెప్పాలి.
ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి హన్సిక( Hansika ).ఈ సినిమాలోని ఈమె నటన అందంతో ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకున్నారు.

ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హన్సికకు అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి.ఈ విధంగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి హన్సిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్( Allu Arjun ) ఎన్టీఆర్ ( NTR ) రామ్ చరణ్ ( Ram Charan ) ఈ ముగ్గురిలో ఎవరు బాగా డాన్స్ చేస్తారు అన్న ప్రశ్న ఈమెకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు హన్సిక చాలా తెలివిగా సమాధానం చెబుతూ ముగ్గురు చాలా బాగా డాన్స్ చేస్తారని చెప్పగా అలా కాదు ఎవరో ఒకరి పేరే చెప్పాలి అనడంతో అల్లు అర్జున్ ఎన్టీఆర్ వీరిద్దరూ చాలా బాగా డాన్స్ చేస్తారని వీరిద్దరిలో ఒకరి పేరు చెప్పడం అంటే చాలా కష్టం అంటూ ఈమె తెలియజేశారు.ఇలా అల్లు అర్జున్ ఎన్టీఆర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అంటూ హన్సిక చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తనకు పుష్ప సినిమా అంటే చాలా ఇష్టమని తెలిపారు.ఇక తెలుగులో చివరిగా తాను ఖుషి సినిమా చూశానని హన్సిక వెల్లడించారు.ఇక దర్శకులలో తనకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టమా ఈ సందర్భంగా హన్సిక టాలీవుడ్ హీరోల గురించి దర్శకుల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
.