అవును, మీరు విన్నది నిజమే.ఇదెక్కడి విడ్డురం అని అనుకుంటున్నారు కదూ.
అది కూడా ఓ పండుగ రోజు అక్కడి జనాలు అచ్చం దెయ్యాల్లాగా ముస్తాబు అవుతారు అంటే నమ్మకశక్యం కాలేదు కదూ.కానీ ఇది అక్షర సత్యం.ఆరోజు కొత్త బట్టలు, రకరకాల నైవేద్యాలు, పూజలతో తాళ్లు ఇల్లు సందడిగా ఉంటుంది.దేవతల కరుణ కోసం పండుగలు చేసుకోవడం మాదగ్గర కూడా సాధారణమే.కానీ ఇలా దెయ్యాల్లాగా అలంకరించుకోవడం ఇండియాలో నిషిద్ధం కూడాను.అయితే ‘హలోవీన్’ పండగ మాత్రం వారికి చాలా ప్రత్యేకత.
ఆరోజు అక్కడి జనాలు దయాల్లా తయారై వీధుల్లో తిరుగుతారు.ఇదో పాశ్చాత్య పండుగ.ఈ పండుగ పుట్టుక వెనుక సెల్ట్స్ అనే తెగ ప్రజలు ఉన్నారని చరిత్రలో లిఖించబడింది.క్రీస్తు పూర్వం ఐర్లాండ్, UK, ఫ్రాన్స్ దేశాల్లో నివసించేవారట.
వారే మొదట ఈ హలోవీన్ పండుగను నిర్వహించారని పూర్వీకులు చెబుతూ వుంటారు.ప్రతి ఏడాది అక్టోబర్ 31న ఈ వేడుకను నిర్వహిస్తారు.
అదే తరాలుగా వస్తూ వుంది.అలాగే దీనిని అనేక దేశాల్లోని ప్రజలు అచరిస్తున్నారు నేటికీ.
నవంబర్ సెల్ట్స్ ప్రజలకు చలి పుట్టించే నెల.చలితో పాటూ అనేక రోగాలు కూడా వస్తాయి.అందుకే నవంబర్ నెలను ‘మరణం నెల’గా భావించేవారట.
ఈ కాలంలో రాత్రి సమయం ఎక్కువ ఉండి, పగలు సమయం చాలా తక్కువ ఉంటుంది కదా.
ఈ చల్లని నెలలో ఆత్మలు భూమిపైకి వచ్చి ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాయని వారు నమ్ముతారు.అందుకే నవంబర్ మొదలు కావడానికి ఒకరోజు ముందే ‘హలోవీన్’ పండుగను నిర్వహిస్తారు.అక్టోబర్ 31 రాత్రిన ఇళ్ల మధ్యన మంటలు పెట్టి, వాటి చుట్టూ చేరి దైవాన్ని ప్రార్థిస్తారు.ఈరోజు వింతగా జంతవుల చర్మాలను ధరించి, వాటి తలలను కూడా వారు తగిలించుకుంటారు.19వ శతాబ్ధం ముందు వరకు అమెరికాకు హలోవీన్ పండుగంటే తెలియదు.కానీ తర్వాతికాలంలో ఈ పండుగ అక్కడ పరిచయం అయింది.
ఇప్పుడు ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది ఇక్కడ.