రెండున్నర టన్నుల శివలింగం ప్రతిష్ఠాపనకు ముస్లిం సహాయం.. ఎక్కడంటే..

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఉన్న ప్రసిద్ధ పశుపతినాథ్ మహాదేవ్ ఆలయంలో సహస్త్రేశ్వర్ మహాదేవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.ఈ శివలింగ ప్రతిష్ఠాపన కోసం క్రేన్ సహాయం తీసుకోవలసి వచ్చింది.

 Half Ton Shivalingam Established By Muslims , Devotee, Shivaingam, Sahastreshwar-TeluguStop.com

ఇందుకోసం పిడబ్ల్యుడి, పిహెచ్‌ఇ, జిల్లా పంచాయతీతో సహా అన్ని శాఖల ఇంజనీర్లను పరిపాలన అధికారులు పిలిపించించారు.అయితే వారెవరూ శివలింగాన్ని కోరిన విధంగా అమర్చలేకపోయారు.

దీంతో ఒక ముస్లిం కార్మికుడు ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించే బాధ్యతను తీసుకున్నాడు.ఈ శివలింగం ప్రత్యేకతల గురించి చెప్పుకోవలసి వస్తే.

ఇది సహస్త్రేశ్వర్ మహాదేవ్ రూపం.దీని ఆకృతి చాలా ప్రత్యేకమైనది.

దీని పొడవు 6.50 అడుగులు.ఈ శివలింగం బరువు రెండున్నర టన్నులు.దీని ఏర్పాటు వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది.దీనిని ఆలయంలో ప్రతిష్ఠించేందుకు ఇంజనీర్లు పలు అవస్థలు పడ్డారు.వీరిని మక్బూల్ అనే తాపీ మేస్త్రీ గమనించాడు.

అధికారులు, ఇంజనీర్లు ఈ సమస్యతో పోరాడుతున్న తీరును చూసిన మక్బూల్‌ సమస్యను పరిష్కారాన్ని సూచించారు.ఈ సలహాను అక్కడున్న అధికారులంతా మెచ్చుకున్నారు.

పాఠశాల ముఖం కూడా చూడని మక్బూల్ తన అనుభవంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు.నీటిలో శివలింగాన్ని ప్రతిష్ఠించే ప్రదేశంలో ఐస్‌ను ఉంచితే.

శివలింగాన్ని సురక్షితంగా ప్రతిష్ఠించగలమని మక్బూల్ తెలిపాడు.మంచు కరగడంతో స్వామివారి శివలింగం జలాల్లోకి ప్రవేశించి ప్రతిష్ఠితం కానుందనన్నాడు.

ఇంజినీర్లకు సమస్యకు పరిష్కారం దొరికింది.అల్లా మరియు శివుడు ఒక్కరేనని మక్బూల్ తెలిపాడు.

ఈ పనిలో తన వంతు సహకారం అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube