ఏకంగా వందమంది అమ్మాయిలను హ్యాక్ చేసి...ఏం చేసాడంటే..!

ఈజీ గా డబ్బులు సంపాదించడానికి యువత ఎంతకైనా తెగబడుతున్నారు.

జల్సాలకు అలవాటు పడి ఎలా కష్టపడాలి అని ఆలోచించడం మానేసి ఎవరిని మోసం చేస్తే, ఎలా మోసం చేస్తే ఈజీగా డబ్బులు వస్తాయో అలాంటి దారుల్ని వెతుకుతున్నారు.

ఇలాంటి వారందరికీ ఇంటర్నెట్ ఒక వేధికగా మారిపోయింది.మంచి కోసం ఉపయోగించడం మానేసి దానిలో ఉన్న సమాచారాన్ని దుర్వినియోగం చేసి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు.

మనం అందరం ఇంటర్నెట్ వాడతాం ఫేస్ బుక్ ,ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్స్ చాలా యాప్స్ ఉపయోగిస్తాం.అయితే మనం జాగ్రత్తగా ఉండకపోతే మన వ్యక్తిగత వివరాలు అన్ని ఆన్లైన్ లో ఉంటాయి.

సైబర్ నేరగాళ్లు మన అకౌంట్ లను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ లకు తెగబడే అవకాశాలు ఉన్నాయి.ఇలాంటి ఘటనే చండీగఢ్ రాష్ట్రంలో జరిగింది.

Advertisement

వాట్సాప్ నంబర్ ని హ్యాక్ చేసి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మంది అమ్మాయిలను హ్యాక్ చేశారు.హ్యాక్ చేయడమే కాకుండా వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేశారు.

ఇక అసలు వివరాల్లోకి వెళితే.హరియాణా కు చెందిన ముగ్గురు వ్యక్తులు అమ్మాయిల వాట్సాప్ నంబర్ లు సేకరించి వాటిని హ్యాక్ చేయడం వృత్తి గా ఎంచుకున్నారు.

వాట్సాప్ యాప్‌ను హ్యాక్ చేసి సంపాదించిన వివరాలతో 100మందిపైగా అమ్మాయిలను బ్లాక్ ‌మెయిల్ చేస్తున్నారు.వాళ్ళ వ్యక్తిగత వివరాలను బయటపెడతామని బెదిరించి సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు యువకులను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరు ముగ్గురూ కలిసి హ్యాకింగ్ ద్వారా 100 మందికిపైగా అమ్మాయిల వివరాలు సంపాదించారు.తమకు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వారి వ్యక్తిగత వివరాలను పబ్లిక్ చేస్తామని బెదిరించేవారని పోలీసులు తెలిపారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

నిందితుల్లో ఒకరు ఎయిర్‌టెల్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు.అతనే తన మిత్రులకు నకిలీ ఐడీలతో సిమ్‌కార్డులు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.వీరు బాధితులు ఒక్కొక్కరి వద్ద రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేయడమే కాకుండా లైంగికగా వేధింపులకు గురి చేసేవారని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు