హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విజయవంతంగా పదేళ్ల సినీ ప్రయాణం పూర్తి

అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాయి.

ఆగస్టు 9, 2012న విడుదలైన జులాయితో ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించి, మొదటి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకొని, మంచి అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు.

అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.పదేళ్ల సినీ ప్రస్థానంలో ఈ సంస్థల నుంచి 16 సినిమాలు రాగా, అందులో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం విశేషం.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ కి ప్రత్యేక అనుబంధముంది.జులాయి నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అన్ని చిత్రాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండటం విశేషం.

ఇక సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా యువ ప్రతిభకు పెద్ద పీట వేస్తుంటారు.ఈ పదేళ్లలో ఈ రెండు బ్యానర్స్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, ప్రేమమ్, అరవింద సమేత, జెర్సీ, భీష్మ, భీమ్లా నాయక్, డీజే టిల్లు, అల వైకుంఠపురములో ఇలా పదికి పైగా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.

Advertisement

ఇక ముందు కూడా తమకు అందరి అభిమానం, ఆశీస్సులు, ప్రేక్షకుల మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక వీడియోని విడుదల చేశారు."జులాయితో ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.

మీరు ఇచ్చిన ప్రేమ ఈ అందమైన చిత్రాలన్నీ తీయగలననే నమ్మకాన్ని కలిగించింది.మీరు మాకు విభిన్న చిత్రాలను తెరకెక్కించడానికి మరియు అనేక భావోద్వేగాలను తెరపై అందించడానికి అవకాశం ఇచ్చారు.

ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో మీ ప్రేమ మరియు మద్దతు మమ్మల్ని మరిన్ని సవాళ్లు స్వీకరించేలా చేశాయి.ఇన్నాళ్లూ మీ ప్రేమకు ధన్యవాదాలు.

మీ మద్దతు ఇకపై కూడా ఇలాగే ఉంటుందని, మరిన్ని అద్భుతమైన చిత్రాలతో మిమ్మల్ని మరింత అలరిస్తామని ఆశిస్తున్నాము." అంటూ వీడియోలో పేర్కొన్నారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

మధురమైన పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో భారీ విజయాలను అందుకున్న హారిక అండ్ హాసిని, సితార సంస్థల నుంచి మరిన్ని అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయి.అందులో స్వాతిముత్యం(గణేష్, వర్ష బొల్లమ్మ), అనగనగా ఒక రాజు(నవీన్ పొలిశెట్టి), PVT04(పంజా వైష్ణవ్ తేజ్), SSMB28(మహేష్ బాబు, త్రివిక్రమ్, పూజ హెగ్డే), DJ టిల్లు-2(సిద్ధు జొన్నలగడ్డ), సార్(ధనుష్, సంయుక్త మీనన్), మలయాళ చిత్రం కప్పెల రీమేక్(సూర్య, అర్జున్ దాస్, అనిఖ సురేంద్రన్) వంటి చిత్రాలున్నాయి.

Advertisement

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ రెండవ దశాబ్దంలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉన్నాయి.

తాజా వార్తలు