గుంటూరు కారం కేరళ షూట్ క్యాన్సిల్.. కారణం ఇదేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Kaaram ).మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Guntur Karam Song Shoot Update, Guntur Kaaram, Trivikram Srinivas, Mahesh-TeluguStop.com

ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తిగా చూస్తున్నారుఈ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా శరవేగంగా షూట్ జరుపు కుంటున్న విషయం తెలిసిందే.ఈ నెలలోనే షూట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ పూర్తి చేయాలి.

ఎందుకంటే వచ్చే నెలలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవ్వబోతుంది.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక సాంగ్ షూట్ కోసం కేరళ వెళ్లాలని అక్కడే మహేష్, శ్రీలీలపై మూడవ సాంగ్ షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు.కానీ అక్కడ పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవకపోయావడంతో ఈ షూట్ ను క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోనే సాంగ్ షూట్ ను రేపటి నుండి షురూ చేయనున్నట్టు తెలుస్తుంది.

కాగా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( Sreeleela Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube