”గుంటూరు కారం”.సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది.
సర్కారు వారి పాట వంటి హిట్ తర్వాత మహేష్ బాబు మరో సినిమాను రిలీజ్ చేయలేదు.లాంగ్ గ్యాప్ తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన మహేష్ ఈసారి గుంటూరు కారం ( Guntur Kaaram )సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే( Pooja Hegde ), శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక థమన్( Thaman ) సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత షూట్ స్టార్ట్ చేసుకుంది.

అయితే రెండు షెడ్యూల్స్ తర్వాత ఈ సినిమా వాయిదా పడింది.ఇప్పటికీ కొత్త షెడ్యూల్ ఇంకా స్టార్ట్ కాలేదు.రేపో మాపో అంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు.
మరి ఈ షెడ్యూల్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి మాత్రం ఒక వార్త వైరల్ అవుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి మాస్ స్ట్రైక్ అంటూ వీడియో, టైటిల్ ను రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ గ్లింప్స్ చూసిన తర్వాత మహేష్ బాబు పూర్తిగా రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించ బోతున్నాడని అర్ధం అవుతుంది.ఇక తాజాగా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్ తో నడుస్తాయని.గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ నడుస్తుందని టాక్.అంతేకాదు ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుందని మొత్తానికి ఈ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే మెయిన్ హైలెట్ అని అంటున్నారు.







