ప్రజా గాయకుడు గద్దర్ బృందం ఢిల్లీకి చేరుకుంది.కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం గద్దర్ బృందం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే హస్తినకు వెళ్లిన బృందం సభ్యులు రేపు ఎన్నికల కమీషన్ తో భేటీ కానున్నారు.‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరుతో గద్దర్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు.
కాగా విప్లవానికి పోరాటానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది.జెండా మధ్యలో పిడికిలి గుర్తుతో పాటు ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో రూపొందించారని సమాచారం.







