సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాల్లో గుంటూరు కారం( Guntur Kaaram ) ఒకటి.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
షూట్ ఆగిపోతూ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ఈ సినిమా విషయంలో మాత్రం అంచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు.మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్( SreeLeela ) గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూట్ స్టార్ట్ చేసుకుంది.
రెండు మూడు షెడ్యూల్స్ కూడా ముగించారు.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.చాలా రోజుల తర్వాత మహేష్ మరింత ఊర మాస్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను మెప్పించాడు.అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా.ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా సగం కూడా పూర్తి కాకుండానే బిజినెస్ నెక్స్ట్ లెవల్లో జరుపు కుంటున్నట్టు తెలుస్తుంది.ఇక ఇది వరకు ఓటిటి డీల్ భారీ ధరకు క్లోజ్ చేసుకోగా ఇప్పుడు నైజాం హక్కులు క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.
ఎప్పటిలానే నైజాం హక్కులను దక్కించుకోవడంలో ముందు ఉండే దిల్ రాజునే ఈసారి కూడా హక్కులను దక్కించుకున్నట్టు తెలుస్తుంది.
గుంటూరు కారం నైజాం హక్కులను దిల్ రాజు ఏకంగా 40 కోట్లకు పైగానే వెచ్చించి మరీ సొంతం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది.ఇదే నిజమైతే ఈ రేంజ్ బిజినెస్ జరగడం రికార్డ్ అనే చెప్పాలి.కాగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.