జూనియర్ సమంతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి అషురెడ్డి(Ashu Reddy).సోషల్ మీడియా వేదికగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలను కూడా అందుకొని బిజీగా ఉన్నారు.
సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయ్యారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అషురెడ్డి ఎంతో ఫేమస్ అయ్యారని చెప్పాలి.

నిత్యం వెకేషన్ కి వెళ్తూ విదేశాలలో ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేతికి సైలెన్( Saline ) ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.దీంతో ఒక్కసారిగా అభిమానులు అషురెడ్డికి ఏమైంది ఇలా చేతికి సైలెన్ పెట్టారు అసలు తనకేం జరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రస్తుతం తాను అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు.
చేతికి సెలైన్ పెట్టి కుర్చీలో రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ త్వరలోనే తిరిగి వస్తానని క్యాప్షన్ పెట్టారు.

ప్రస్తుతం ఈమె అమెరికాలో (America)ఉండగా అక్కడ తనకు అనారోగ్యం చేసిందని అయితే త్వరలోనే తిరిగి వస్తానంటూ ఈమె ఈ ఫోటోలను షేర్ చేయడంతో తనకసలు ఏమైంది అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే డ్రగ్స్(Drugs) కేసులో ఈమె పేరు వచ్చింది కనుక ఇలాంటి డ్రామాలు ఆడుతుంది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.మరి ఈమెకు ఏం జరిగిందో తెలియాలి అంటే ఈమె తన ఆరోగ్య సమస్య గురించి చెప్పాల్సి ఉంది.
ఇక డ్రగ్స్ కేసు వ్యవహారంలో అషురెడ్డి పేరు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.







