గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ జిల్లాలో ఈ ప్రమాదం వాటిల్లింది.
ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది దుర్మరణం చెందారు.ఆనంద్ జిల్లా తారాపూర్ సమీపంలో నేషనల్ హైవే పై కారు ట్రాక్ ఢీకొన్నాయి.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.తొమ్మిది మంది పెద్దవాళ్ళు కాగా మృతులలో ఒక చిన్నారి ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే సంఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఒకే కుటుంబానికి చెందిన 10మంది మృతి చెందటంతో కుప్పలుతెప్పలుగా రోడ్డుపై శవాలు ఉండటంతో అటు పక్కగా వెళ్లే వాహనదారులు సంఘటనా స్థలాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు.
ప్రమాదానికి గల కారణం కారు అతివేగమే అని అంటున్నారు.ఈ క్రమంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు.మృతులు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు.