ఒక 21 ఏళ్ల ఎన్నారై యువతి తన తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇచ్చింది.అయితే ఆమె ఇండియాకి చెందిన ఆ అమ్మాయి తన చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకి వెళ్లి, అమెరికాలోనే పెరిగి పెద్దయింది.
అయితే తన తల్లిదండ్రులతో కలిసి ఆమె ఇటీవల ఇండియాకు వచ్చింది.అయితే అలా వచ్చిన యువతి తన తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇచ్చి తన ఇంట్లో నుంచి పారిపోయి డ్రైవర్ ను పెళ్లి చేసుకుంది.
అయితే గుజరాత్ లోని బార్డోలి గ్రామానికి చెందిన ఈ అమ్మాయి తన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకి వెళ్ళింది.అయితే తన తల్లిదండ్రులు ఎన్నో రెస్టారెంట్లు ప్రారంభించారు.
వ్యాపారం బాగా ఉండటంతో కుటుంబం మొత్తం అమెరికాలోనే స్థిరపడింది.
ఈ క్రమంలోనే ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా లభించింది.
అయితే ఆ 21 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి తన స్వగ్రామానికి వచ్చింది.అలా వచ్చిన ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది.
దీంతో తన తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెంది ఆమెను తీవ్రంగా గాలించారు.ఇక కొద్ది రోజుల తర్వాత చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.
తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
అయితే దర్యాప్తు చేస్తున్న సమయంలో ఒక షాకింగ్ విషయం బయటపడింది.

అయితే ఆ యువతి ప్రస్తుతం కోపరేటివ్ సొసైటీలో డ్రైవర్ గా పనిచేసే ఒక యువకుడితో పారిపోయిందని తెలిసింది.అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అతన్ని పెళ్లి కూడా చేస్తుందని తెలిసింది.అదేవిధంగా వాళ్ళ పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ ను లాయర్ తో పోలీస్ అధికారులు అందించినట్టు తెలుసుకొని ఆ యువతి తల్లిదండ్రులు కంగుతిన్నారు.
అయితే అమెరికాలో తన పేరిట అన్ని రెస్టారెంట్లు కలిగిన యువతి ఒక డ్రైవర్ ను వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది.అయితే ఆ యువతీకి ఆ యువకుడితో పరిచయం ఎలా ఏర్పడిందని ఇదంతా ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు బయటికి రాలేదు.







