సెలబ్రిటీ చెఫ్ సాల్ట్ బే 2021 సెప్టెంబర్‌లో లండన్‌లో తన రెస్టారెంట్‌ను ప్రారంభించి ఫుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు.ఈ చెఫ్ చాలా ఆహారాల ధరలను తగ్గించి అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
సాల్ట్ బే అసలు పేరు నుస్రెట్ గోక్సే.అతను తన సిగ్నేచర్ స్టైల్ సాల్ట్ స్ప్రింక్లిన్గ్ కి ప్రసిద్ధి చెందాడు.
సాల్ట్ బే ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ స్టీక్ హౌస్‌ల గొలుసు అయిన నస్ర్-ఎట్‌ను రన్ చేస్తున్నాడు.అతను తన “సెలబ్రిటీ” స్టీక్స్ కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తాడు.
గోల్డెన్ లీఫ్‌తో ఫ్రొజ్ చేసిన అతని గోల్డెన్ టోమాహాక్ స్టీక్ ధర 850 పౌండ్స్ కాగా బర్గర్‌ల ధర 100 డాలర్లు.
సాల్ట్ బే రెస్టారెంట్‌లో ఫుడ్ తినడం అంటే జేబుకి పెద్ద చిల్లు పడడమేనని చెప్పొచ్చు కానీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ చెఫ్‌కి చెందిన బర్గర్ బార్‌లో రేట్లు చాలా తక్కువగా ఉంటాయి.
అలీ అనే వ్యక్తి సాల్ట్ బే ఇస్తాంబుల్ బర్గర్ బార్‌ను గురించి ఇంటర్నెట్ వేదికగా కొన్ని విషయాలను పంచుకున్నాడు.ఇక్కడ ఫుడ్ రుచి కూడా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు.వేరే సాల్ట్ బే రెస్టారెంట్‌లో రూ.10,000 విలువైన బర్గర్ ఇక్కడ సుమారు £8 (రూ.800)కే దొరుకుతుందని అతని పేర్కొన్నాడు.

ఇస్తాంబుల్ బర్గర్ జాయింట్‌కి వెళ్లిన మరో టిక్‌టాక్ వినియోగదారు దానిని 8/10గా రేట్ చేసారు.వారు కేవలం £7కి £100 Nusr-Et బర్గర్‌ను పొందామని పేర్కొన్నారు.అయితే ఇక్కడ చాలా తక్కువ రేట్ కి ఎందుకు బర్గర్ అమ్ముతున్నారో తెలియాల్సి ఉంది.







