ఏసీ టికెట్ కొన్న ప్రయాణికుడికి చేదు అనుభవం.. రైలెక్కలేకపోయాడు..

పండుగల కారణంగా రైళ్లలో రద్దీ బాగా పెరిగింది.మొదట దసరా, ఇప్పుడు దీపావళి( Diwali ) కారణంగా రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.

 Gujarat Man With Ac Ticket Fails To Board Crowded Train Details, Latest News, Tr-TeluguStop.com

పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారు.దీంతో స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉంది.

అవసరాలకు తగ్గట్టు రైళ్లు లేకపోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏసీ టికెట్( AC Ticket ) తీసుకున్నా రైలు ఎక్కలేని అనుభవం ఓ వ్యక్తికి ఎదురైంది.

ఇప్పుడు ఈ వ్యక్తి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.భారతీయ రైల్వే నుండి తన టిక్కెట్‌ డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగాడు.

గుజరాత్‌లోని( Gujarat ) వడోదర నివాసి అన్షుల్ సక్సేనా( Anshul Saxena ) తన సమస్యను ట్విట్టర్‌లో వ్యక్తం చేశాడు.అన్షుల్ థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నాడు.

కానీ రద్దీ కారణంగా అతను రైలు ఎక్కలేకపోయాడు.ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ, ‘నాకు రూ.1173.95 పూర్తి వాపసు కావాలి’ అని అన్షుల్ రాశారు.అతను డీఆర్ఎం వడోదరను కూడా ట్యాగ్ చేశాడు.

అన్షుల్ తన ట్వీట్‌లో కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేశాడు.ఇందులో స్టేషన్‌లో భారీ గుంపు కనిపిస్తుంది.‘నా దీపావళిని నాశనం చేసినందుకు ధన్యవాదాలు’ అని తన ట్వీట్‌లో రాశాడు.పోలీసుల సహాయం లేదని, రైలులో కాలు పెట్టేందుకు కూడా వీలు లేకుండా రిజర్వేషన్( Reservation ) లేని వారు రైలు ఎక్కారని వాపోయాడు.

తనలాగే రైలు ఎక్కలేని వారు ఇంకా చాలా మంది ఉన్నారని తెలిపాడు.అతను ఇంకా ఇలా వ్రాశాడు, ‘కార్మికుల గుంపు నన్ను రైలు నుండి బయటకు విసిరింది.

వారు తలుపులు మూసివేశారు.

ఎవరినీ లోపలికి అనుమతించలేదు.ఇదంతా చూసి పోలీసులు నవ్వుతూ నాకు సహాయం చేయడానికి నిరాకరించారు.ఏసీ కోచ్‌లోనూ భారీగా జనం ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారు’ అని యాజమాన్యంపై ప్రశ్నలు సంధించారు.అన్షుల్ ట్వీట్‌కు డీఆర్ఎం వడోదర నుంచి రిప్లై వచ్చింది.

మెరుగైన సహాయం కోసం వివరాలను అందించాలని కోరారు.అతడికి లైఫ్ టైమ్ ఫ్రీ జర్నీ అందించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube