హాట్ డాగ్ ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ ఐటమ్.ఈ హాట్ డాగ్ గురించి భారత్ లో పెద్దగా ఎవరికీ తెలియదు కానీ, విదేశాల్లో చాలా మంది ఫెవరెట్ ఫుడ్ గా చెబుతూ ఉంటారు.
ఇది చూడడానికి కూడా పొడవుగా ఉంటుంది కానీ తినడానికి మాత్రం చాలా టేస్టీ గా ,ఫాస్ట్ గా తినడానికి వీలుగా ఉండే ఐటమ్.దీనితో చాలా మంది కూడా ఎంత హడావుడి గా ఉన్నా ఈ ఒక్క ఐటమ్ తిని హ్యాపీ గా ఆఫీస్ లకు వెళ్లిపోతుంటారు.
అయితే చికెన్ తో చేసే ఐటమ్ కావడం తో ఒక్కటి తింటే కూడా చాలా హెవీ గా అనిపిస్తుంది.అందుకే ఈ ఫాస్ట్ ప్రపంచం లో ఈ హాట్ డాగ్ కు భలే క్రేజ్.
అయితే అలాంటి హాట్ డాగ్ లవర్స్ కోసం న్యూయార్క్ కు చెందిన ఒక రెస్టారెంట్ టీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద హాట్ డాగ్ ని తయారు చేసింది.ఇంతకీ ఆ హాట్ డాగ్ బరువు ఏంతో తెలుసా ఏకంగా 66 పౌండ్లు(దాదాపు 30 కేజీలు).
![అతిపెద్ద హాట్ డాగ్ బరువు ఎంతో అతిపెద్ద హాట్ డాగ్ బరువు ఎంతో](https://telugustop.com/wp-content/uploads/2019/07/Guinness-World-Record-withhuge-hot-dog-weighing-66-pounds.jpg)
అంతేకాకుండా ఇది 5 అడుగుల పొడవు కూడా ఉంటుంది.ప్రపంచంలో ఇదే అతి పెద్ద హాట్ డాగ్ అంటున్నారు.ఇంత పెద్ద హాట్ డాగ్‌ను తినాలని ఎంతో మంది ఎదురుచూశారు.వాళ్లను కాసేపు నోరూరించిన రెస్టారెంట్ నిర్వాహకులు ఆ తర్వాత దాన్ని చక్కగా వీడియో తీసి, ఫొటోలు తీసి అందరికీ చూపించి ఆ తర్వాత అందరికీ పంచిపెట్టారు.
అయితే ఆ అతిపెద్ద హాట్ డాగ్ ని తిన్న వారంతా కూడా అంత పెద్దది చేసినా టేస్ట్ ఏమాత్రం మారలేదనీ చాలా బాగుందని చెబుతూ లొట్టలేసుకొని మరి తెగ తిన్నారట.