అక్రమంగా ఉంటున్నారా.. విదేశీయులకు దుబాయ్ మరో ఛాన్స్, రంగంలోకి ఇండియన్ ఎంబసీ

మెరుగైన జీవితం, వృత్తి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు విదేశాలకు వలస వెళ్తున్నారు.

వీటిలో అక్రమ వలసలు కొన్నైతే, సక్రమ వలసలు మరికొన్ని.

ఏది ఏమైనా అన్ని దేశాలకు వలసదారులు పెద్ద తలనొప్పిగా మారారు.చట్టం అనుమతించిన దానికంటే వలసదారులు కిక్కిరిసిపోతుండటంతో వారిని వదిలించుకునేందుకు , నియంత్రించేందుకు ఆయా దేశాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.

ఆస్ట్రేలియా, కెనడా, యూకే తదితర దేశాలు ఇప్పటికే రంగంలో దిగాయి.తాజాగా ఈ లిస్ట్‌లోకి ఏడారి నగరమైన దుబాయ్( Dubai ) చేరింది.

వీసా గడువు ముగిసినా, ఇంకా అక్కడే చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని ఏరిపారేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.అయితే మానవతా దృక్పథంతో మనసు మార్చుకుని అలాంటి వారికి మరో ఛాన్స్ ఇచ్చింది.ఇలాంటి వారు తమ వీసాలను క్రమబద్ధీకరించుకునేందుకు, లేదంటే జరిమానా లేకుండా దుబాయ్‌ను విడిచి వెళ్లేందుకు అవకాశం కల్పించింది.

Advertisement

అదే ఆమ్మెస్టీ స్కీమ్( Amnesty program ).ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1, 2024 నుంచి మొదలై, అక్టోబర్ 30, 2024 వరకు ఉంటుందని పేర్కొంది.

ఇది యూఏఈలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులపైనా ప్రభావం చూపుతోంది.ఆ దేశ జనాభాలో 30 శాతం మంది ఎన్ఆర్ఐలే.గణాంకాల ప్రకారం అక్కడ దాదాపు 35 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా.

ఇలాంటి బాధితులకు సాయం చేసేందుకు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం కూడా రంగంలోకి దిగి పలు మార్గదర్శకాలను జారీ చేసింది.భారత్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్న వారు తక్షణం ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌( Emergency Certificate ) కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

అప్లై చేసిన మరుసటి రోజే ఈసీని తీసుకోవచ్చని.ఇందుకోసం యూఏఈలో కేంద్రాలను ఏర్పాటు చేశామని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.దుబాయ్‌లోనే ఉండాలనుకునేవారు మాత్రం స్వల్పకాలానికి పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

భోజనం మధ్యలో లేపి దూరంగా కూర్చోవాలని చెప్పారు.. పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు!
యూకేలో భారత సంతతి బాలిక దారుణ హత్య.. తల్లే హంతకురాలు, ఎట్టకేలకు వీడిన మిస్టరీ

ఆయా సేవల కోసం ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ అక్కర్లేదని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు