పైకి నవ్వులు ..లోపల మంటలు ! తెలంగాణ బీజేపీలో ఇదా పరిస్థితి ?

తెలంగాణ బీజేపీ లో ఇప్పుడు ఆధిపత్య పోరు నాయకుల మధ్య మొదలైనట్టు కనిపిస్తోంది.  అయితే ఇది పైకి కనిపించకుండా చాప కింద నీరులా విస్తరిస్తోంది.

  ముఖ్యంగా బీజేపీ కీలక నాయకుల మధ్య ఇటీవల కాలంలో ఆధిపత్య ధోరణి బాగా పెరిగిపోయిందట.తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసే విషయం కంటే , తమ మాట చెల్లుబాటు కావాలని,  అధిష్టానం దగ్గర తమకే ఎక్కువ గుర్తింపు ఉండాలని ధోరణి ఈ మధ్యకాలంలో కీలక నాయకులు మధ్య పెరిగిపోవడం బీజేపీలో చర్చనీయాంశం అవుతోంది.

ముఖ్యంగా టిఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరిన తర్వాత ఈ ఆధిపత్య ధోరణి ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తోంది.తెలంగాణలో ఈటెల రాజేందర్ కు గట్టిపట్టు ఉండడం , ఉద్యమకాలం నుంచి ఆయన ప్రజా పోరాటంలో పాల్గొనడం,  టిఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కీలక నాయకుడిగా ఆయన ఉండడం,  ఇలా ఎన్నో అంశాలు బిజెపిలో చేరిన రాజేందర్ కు క్రేజ్ తెచ్చిపెడుతూనే ఉన్నాయి.

అదీ కాకుండా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రాజేందర్ పెద్దగా బిజెపి పేరు ప్రస్తావించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి విజయం సాధించడం, ఇలా అనేక రకాలుగా ఆయన హవా బీజేపీ లో పెరిగింది.  అయితే ఈ పరిణామాలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు,  కిషన్ రెడ్డి లకు రుచించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరక ముందు కిషన్ రెడ్డి,  బండి సంజయ్ రెండు వర్గాలుగా వుండేవారు.

ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరిన తరువాత మూడు గ్రూపులుగా మారడం తో పార్టీ కేడర్ కూడా అయోమయానికి గురవుతున్నారట.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ కు ఈటెల రాజేందర్ మద్దతు పలికారు.రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం బీజేపీలో చేరతారని అంతా భావించారు.

కానీ బండి సంజయ్ రవీందర్ సింగ్ చేరికను అంతగా ఇష్టపడకపోవడం, తదితర కారణాలతో మళ్లీ ఆయన టిఆర్ఎస్ గూటికి వెళ్ళిపోయారు.రవీందర్ సింగ్ ను బీజేపీ లో చేర్చుకుంటే,  ఆ క్రెడిట్ ఈటల రాజేందర్ కు వెళ్తుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ప్రచారం బీజేపీ లో మొదలైంది.

అయితే అంతర్గతంగా గ్రూపు విభేదాలు ఉన్న,  పైకి తామంతా ఒక్కటే అన్నట్లుగా , బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ఏకైక అజెండా అన్నట్లుగా నాయకుల వ్యవహారం ఉంది.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు