అల్లు అరవింద్, బాలయ్య మధ్య పెరుగుతున్న బాండింగ్.. చిరును పక్కన పెట్టారా?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఎలాంటి అనుబంధం ఉందొ మనందరికీ తెలిసిందే.అల్లు అరవింద్ కు స్వయానా బావవరస అవుతున్నటువంటి చిరంజీవి కోసం ఎన్నో అద్భుతమైన కథలను తీసుకువచ్చి తన గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు.

 Growing Bonding Between Allu Aravind And Balayya Chiru Kept Aside , Growing Bond-TeluguStop.com

ఇక ఏ చిన్న పండుగ జరిగిన అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకే చోటే సందడి చేసేవారు.అయితే ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య ఇలాంటి పరిస్థితులు కనబడడం లేదని తెలుస్తుంది.

మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.అయితే అలాంటిదేమీ లేదంటూ ఈ రెండు కుటుంబాలు చెప్పినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నాయనేది తాజాగా వీరి వ్యవహార శైలి చూస్తుంటే అర్థమవుతుంది.

అల్లు అరవింద్ పూర్తిగా చిరంజీవి ఫ్యామిలీని దూరం పెట్టినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే అల్లు అరవింద్ బాలయ్యకు దగ్గరవుతున్నారు.అల్లు అరవింద్ ఆహా సంస్థను స్థాపించడమే కాకుండా ఇందులో అన్ స్టాపబుల్ టాక్ షో నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి బాలకృష్ణను వ్యాఖ్యాతగా తీసుకువచ్చారు.

Telugu Allu Aravind, Balayya, Chiru-Movie

అదేవిధంగా బాలకృష్ణతో అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి కూడా అల్లు అరవింద్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.ఇక మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా విడుదల చేస్తున్నారు అంటే ఆ హీరోల వేడుకలకు మెగా హీరోలు అతిథులుగా రావడం జరుగుతుంది.అయితే మెగా ఫ్యామిలీ నుంచి అతిథులుగా చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ హాజరవుతారు.

అయితే అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదల కాబోతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం బాలకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు సమాచారం.

ఇలా అల్లు అరవింద్ బాలకృష్ణతో తన బాండింగ్ పెంచుకుంటూనే చిరంజీవి దూరం పెడుతున్నారు అనే వాదనం ఇండస్ట్రీలో వినపడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube