అవును, మీరు విన్నది నిజమే.నిత్యం మీ చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం.మీ చేతిలో వుండే ఫోన్ మీకు జరగబోతున్న ప్రమాదాన్ని పక్కాగా అంచనా వేస్తుంది.స్మార్ట్‌ఫోన్ యాక్సెలరోమీటర్ సెన్సర్లు మీ నడక ఆధారంగా రాబోయే ఐదేండ్లలో మీకు మరణం ముప్పు ఉందో లేదో యిట్టె చెప్పేస్తాయి.
USలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.దీనికోసం వారు మూవ్‌స్ప్రింగ్, మైఫిట్‌నెస్‌పాల్ యాప్‌లను వాడారు.
ఈమధ్య కాలంలో ఇలాంటి ఆవిష్కరణలు మీద శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తున్నారు.ఈమధ్య కూడా శాస్త్రవేత్తలు ఒక వినూత్న యాప్ ని అభివృద్ధి చేశారు.
అదేమంటే మీ గుండెకు ఎటువంటి హాని తలపెట్టకుండానే, మీ గుండె యొక్క ఆరోగ్య స్థితిని మీ స్మార్ట్ ఫోన్ కెమెరా ఉపయోగించి సదరు యాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.అదే ఇంతకు ముందు మన గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలంటే దాదాపు 45 నిమిషాల సమయం పట్టేది.
అంటే అల్ట్రాసౌండ్ యంత్రం ద్వారా స్కాన్ చేసేవారు.కానీ, ఇప్పుడు అంత సమయం వేస్ట్ చేయాల్సిన పనిలేదు.

మీ స్మార్ట్ ఫోన్ ని మీ మెడకు దగ్గరగా ఒక 2 నిముషాలు ఉంచుకుంటే చాలు.మీ గుండె యొక్క ఆరోగ్య స్థితిని ఈజీగా తెలుసుకోవచ్చు.అమెరికాకు చెందిన పరిశోధకులు ఈ పరిజ్ఞానాన్ని వృద్ధి చేశారు.ఇది గుండెలో ఉన్న LVEF (లెఫ్ట్ వెంట్రిక్యూలర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్) అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది.
అంటే గుండె కొట్టుకుంటున్న ప్రతి సరి మన గుండె ఎంతమేర రక్తాన్ని బయటకు పంపిస్తోంది అనే విషయాన్ని చెబుతుంది.సాధారణంగా LVEF స్థాయి 50% నుండి 70% మధ్యన ఉండాలి.
ఎప్పుడైతే గుండె బలహీనంగా ఉంటుందో, అటువంటి సమయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.







