తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా కంచుకోట.2019లో జగన్ వేవ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మొత్తం పది సీట్లలో ఎనిమిది స్థానాలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇటీవల సర్వేలలో టీడీపీ వైపు మెుగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది , అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకున్నట్లు వెల్లడైంది.అయితే ఇదే సమయంలో గ్రూపు రాజకీయాల కారణంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అంతటా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది .ధర్మాన ప్రసాదరావుకు సంబంధించిన శ్రీకాకుళం మినహా ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూపు రాజీకియాలు కనిపిస్తున్నాయి.జిల్లా ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ సమస్యల పరిష్కారానికి తొలుత దూకుడుగా వ్వవహరించిన తర్వాత సైలెంట్ అయ్యారు.
ఇచ్ఛాపురంలో మూడు గ్రూపులు ఉండగా, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు వ్వతిరేకంగా ఓ గ్రూపు పని చేస్తుంది.టెక్కలిలో మూడు గ్రూపులు, నరసన్నపేటలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌కు వ్వతిరేకంగా ఓ గ్రూపు ఉంది.
స్పీకర్ తమ్మినేని వంటి సీనియర్‌కు కూడా ఆయన నియోజకవర్గంలోనే రెండు వ్యతిరేక వర్గాలు ఉన్నాయి.ఎచ్చెర్లలో ఎమ్మెల్యే కిరణ్, పాతపట్నంలో రెడ్డిశాంతికి ఇదే సమస్య ఉంది.ఎన్నికల తర్వాత జిల్లా నేతలకు జగన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. పలు నియోజకవర్గాల్లోని నేతలకు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు.

అయితే జిల్లాలో పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి.జిల్లాలో పార్టీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి, 2024లో పార్టీకి నష్టం వాటిల్లుతుందని పార్టీ క్యాడర్ అంటుంది.శ్రీకాకుళంలో మాత్రమే కాకుండా చాాలా జిల్లాలో వైసీసీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. గుంటూరు, తూర్పు గోదావరి, విజయవాడ, విజయనగరం,నెల్లూరు జిల్లాలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
అయితే వివాదాలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి
.