Tollywood Senior Heroes: ఆ విషయంలో చిరు, బాలయ్య, వెంకీల కంటే నాగ్ గ్రేట్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలకు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సీనియర్ స్టార్ హీరోల సినిమాల శాటిలైట్ హక్కులకు కూడా భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది.

 Senior Heroes Movies Trp Ratings Bangarraju F3 Acharya Akhanda Details,balakrish-TeluguStop.com

అయితే హీరోల సినిమాలలో చాలా సినిమాలు రేటింగ్స్ విషయంలో తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తుండటం గమనార్హం.ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోల సినిమాల రేటింగ్స్ ను పరిశీలిస్తే నాగ్ పై చేయి సాధించగా ఇతర హీరోలు తర్వాత స్థానాల్లో ఉన్నారు.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన బంగార్రాజు సినిమా బుల్లితెరపై తొలిసారి ప్రసారమైన సమయంలో ఏకంగా 14 రేటింగ్ ను సొంతం చేసుకుంది.బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బుల్లితెరపై ప్రసారమైన సమయంలో 13.31 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.మరో స్టార్ హీరో వెంకటేష్ నటించిన ఎఫ్3 బుల్లితెరపై ప్రసారమైన సమయంలో కేవలం 8.26 రేటింగ్ ను సొంతం చేసుకుంది.

చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బుల్లితెరపై కేవలం 6.30 రేటింగ్ ను సొంతం చేసుకుంది.

Telugu Acharya, Akhanda, Balakrishna, Bangarraju, Chiranjeevi, Nagarjuna, Venkat

సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకోకపోవడంతో అభిమానులు ఫీలవుతున్నారు.స్టార్ హీరోల సినిమాల ఫలితాలు ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి.ఈ సినిమాలలో ఆచార్య మినహా మిగతా సినిమాలన్నీ వెండితెరపై సక్సెస్ సాధించడం కొసమెరుపు.

Telugu Acharya, Akhanda, Balakrishna, Bangarraju, Chiranjeevi, Nagarjuna, Venkat

స్టార్ హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ హీరోల తర్వాత ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.ఈ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.స్టార్ హీరోల తర్వాత ప్రాజెక్ట్ లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube