మహేష్ బాబు చూడటానికి క్లాస్ హీరోలా కనిపించినా మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులలో కూడా ఆయనకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఓవర్సీస్ మార్కెట్ లో మహేష్ బాబుకు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్ ఉంది.
ఈ జనరేషన్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నా ఆ హీరోలు ఈ రికార్డును సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
మహేష్ బాబు నటించిన సినిమాలలో 11 సినిమాలు ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఈ రికార్డ్ సాధారణ రికార్డ్ కూడా కాదని కొంతమంది కామెంట్లు వినిపిస్తున్నాయి.గడిచిన కొన్ని సంవత్సరాల్లో మహేష్ బాబు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.
ఈ రికర్డ్ బ్రేక్ కావాలంటే మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వస్తుండగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.మహేష్ బాబు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ కనుంది.ఏప్రిల్ నెలలో రిలీజైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మహేష్ బాబు సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా మహేష్ తర్వాత సినిమా ఎఎ.
ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనుంది.

రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమాలన్నీ 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.మహేష్ బాబు రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండగా ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా మహేష్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ బాబు ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి తనకు నచ్చే నప్పే పాత్రలను ఎంచుకుంటూ ఉండటం గమనార్హం.







