గర్భిణీలు ఖచ్చితంగా తినాలి ఇది!

గ్రీన్ ఆపిల్ ని ఎక్కువగా చూసి ఉండం మార్కేట్లో.రుచిలో కాని, న్యూట్రింట్స్ లో కాని ఇది రెడ్ ఆపిల్ కి కొంచెం భిన్నంగా ఉంటుంది.

గర్భిణీలు ఈ గ్రీన్ ఆపిల్ ని ఖచ్చితంగా తినాలి.ప్రెగ్నెంట్ లేడిస్ కి ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుంది ఈ గ్రీనగ ఆపిల్.

* గర్భిణిలకు బలం చాలా అవసరం.అప్పుడే తల్లీ, బిడ్డ .ఇద్దరు ఆరోగ్యకరంగా ఉంటారు.గ్రీన్ ఆపిల్ లో బలానికి అవసరమైన కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.

* గ్రీన్ ఆపిల్ లో న్యూట్రింట్స్ ఎక్కువగా లభిస్తాయి.ఇందులో విటమిన్ సి, ఏ, బి6 తోపాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్ దొరుకుతాయి.

Advertisement

* గర్భిణీల కాలేయంలో ఆసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి.దీంతో ప్రీమెచ్యుర్ బర్త్ లాంటి పెద్ద సమస్యే కాదు, ఎన్నోరకాల చిన్ని చిన్ని ఇబ్బందులు కూడా చూడాల్సివస్తుంది.

కాలేయం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అంటే గ్రీన్ ఆపిల్ ని తినటం ఉత్తమం.* గర్భం ధరించటంతో అందాన్ని కోల్పోయామని బాధపడిపోతుంటారు కొందరు స్త్రీలు.

అలాంటివారికి గ్రీన్ ఆపిల్ చక్కటి నేస్తం.ఇది చర్మాన్ని సంరక్షిస్తూనే, చర్మసౌందర్యాన్ని మరింత పెంచుతుంది.

* జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను సర్వసాధారణంగా చూస్తుంటారు గర్భంతో ఉన్న మహిళలు.రోజూ గ్రీన్ ఆపిల్ తినే అలవాటు ఉంటే జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన ఆకుకూర‌లు ఇవే!

ఎందుకంటే దీంట్లో డైటరీ ఫైబర్ బాగా దొరుకుతుంది.* బ్లడ్ ప్రెషర్ సమస్యల నుంచి గర్భిణీలు ఉపశమనం పొందాలంటే విటమిన్‌ సి ఇంటేక్ మంచి మార్గం.గ్రీన్ ఆపిల్ లో మరీ ఎక్కువగా కాకపోయినా, ప్రతి 100 గ్రాములకి 4.6 మిల్లిగ్రాముల విటమిన్ సి దొరుకుతుంది.* గర్భం ధరించిన సమసయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడం కష్టమైన పనే.కాని గ్రీన్ ఆపిల్ ఆ పని చేసి పెడుతుంది.* గ్రీన్ ఆపిల్ యాంటిఅక్సిడెంట్స్ ఎక్కువ.

Advertisement

ఇది నొప్పులు, ఇంఫెక్షన్లు .ఇతర ఆరోగ్య సమస్యలతో శక్తిమేర పోరాడుతుంది.

తాజా వార్తలు