పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.డీఎంఈ పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లును గవర్నర్ తిరస్కరించారు.

పురపాలక చట్ట సవరణ బిల్లుతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుపై ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై వివరణ కోరారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన పది బిల్లుల్లో మూడింటికి గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపిన ఆమె మూడు బిల్లులపై వివరణ కోరారు.అదేవిధంగా ఒక బిల్లు తిరస్కరణకు గురికాగా మరొక బిల్లు తనకు అందలేదని గవర్నర్ చెబుతున్నారని సమాచారం.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు