తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామంటూ బిల్లును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.దీనికి సంబంధించి గవర్నర్ ఆమోదం కొరకు పంపారు.
కానీ గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ (RTC) కార్మికులంతా గవర్నర్ పై గుర్రుగా ఉన్నారు.దీంతో ఆర్టీసీ కార్మికులంతా ముకుమ్మడిగా కలిసి రాజ్ భవన్ ముట్టడికి ఈరోజు ప్రయత్నం చేశారు.
దీంతో కార్మికులంతా కలిసి రాజ్ భవన్ వైపు ఒక్కసారిగా దూసుకెళ్లారు.కానీ గవర్నర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లేరు.
ఆమె పుదుచ్చేరి (Puduccheri) లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కావడంతో అక్కడ పర్యటన చేస్తున్నారు.

ఈ తరుణంలో ఆమె సోమవారం లేదంటే మంగళవారం రోజున హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులంతా రాజ్ భవన్ (Raj bhavan) ముట్టడికి ప్రయత్నం చేశారు.అయితే ఈ బిల్లుకు సంబంధించి త్వరగా ఆమోదించడం సాధ్యం కానీ పని అని, అందులో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి సలహాలు బిల్లుల అంశాలను పరిశీలించిన తర్వాతే ఆమోదముద్ర వేస్తామని రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన జారీ అయింది.

దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆర్టీసీ కార్మికులు ఖైరతాబాద్ (Khairathabad) చౌరస్తా నుండి చలో రాజ్ భవన్ ముట్టడికి వెళ్తూ “బస్ పయ్య నహి చలేగా” నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.దీంతో అందరిని రాజ్ భవన్ అనుమతికి అవకాశం లేకపోవడంతో పదిమంది ఆర్టీసీ నాయకుల పేర్లను పరిశీలించి వారిని కార్యాలయం లోపలికి పంపారు.ఈ నాయకులతో గవర్నర్ తమిళసై (Tamilasai) వీడియో కాల్ ద్వారా మాట్లాడి వినతి పత్రం తీసుకోనుంది.గవర్నర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్టీసీ విలీనం గవర్నర్ ఆమోదముద్ర వేయడంఫై సరైన సమాధానం వచ్చే అవకాశం ఉంది.







