తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎంసెట్ 2020 ఫలితాలు మంగళవారం మధ్యాహ్నాం 3.30 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే , తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది కూడా కూడా ఉన్నత విద్యామండలి తీరులో ఏ మాత్రం మార్పురాలేదు.ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి.ఎంసెట్ లో కటాఫ్ మార్కులు వచ్చినప్పటికీ , ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టుల్లో పాసైనప్పటికీ ,ఎంసెట్ ఫలితాల్లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ ఫలితం వస్తోంది.
ఈ ఫలితాలను చూసి ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ అవుతున్పారు.అయితే పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు.
కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులని పాస్ చేసింది ప్రభుత్వం.
అయితే , దాన్ని అనుసందాన్నం చేయడంలో మాత్రం సంబంధిత అధికారులు మరోసారి మొద్దు నిద్ర వీడలేదు.కాగా, తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం నెలకొనడం పై ఏబీవీపీ నేత మురళి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యారంగం ఒకటుందనే సోయ అసలు తెలంగాణ ప్రభుత్వానికి లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమని ఆయన ఆరోపించారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఉన్నత విద్యాశాఖకు పూర్తి అధికారాలు లేకపోవడం కూడా ఒక ప్రధానమైన సమస్య అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy