ప్రభుత్వం వెంటనే అది ఎత్తివేయాలి.. పూనమ్ కౌర్ డిమాండ్!

తెలుగు సినీ నటి పూనమ్ కౌర్ గురించి మనందరికీ తెలిసిందే.

పూనమ్ కౌర్ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో తరచూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.

ఈ క్రమంలోనే ఆమె చేసే పలు వ్యాఖ్యలు అప్పుడప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కూడా మారుతూ ఉంటాయి.అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు ఆమె ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటుంది.

ఇక మితిమీరి ఆమెపై ట్రోలింగ్స్ చేసేవారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా పూనమ్ కౌర్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది.

Advertisement

పూనమ్ కౌర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంది.అనంతరం విఐపి దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది.

అయితే ఎప్పుడూ మామూలుగా దర్శించుకునే ఆమె ఈసారి మొదటిసారిగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నాను అని, స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది అని ఆమె చెప్పుకొచ్చింది.

స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వర్గాలు బాగుండాలని శ్రీవారిని ప్రార్ధించానని , అదే విధంగా ప్రభుత్వం వెంటనే జీఎస్టీ ని ఎత్తివేయాలి అంటూ డిమాండ్ చేసింది.ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత అటు నుంచి కంచి కీ వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటాను అని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు