ఎన్టీఆర్ కూతురు ని 'బిచ్చ గత్తె' అన్నాడు

చంద్రబాబు ని విమర్శిస్తే ఎంతటి వారు అని కూడా చూడరు వార్ల రామయ్య.ఆయనకీ ప్రతి విమర్శలు చెయ్యడం లో పెట్టింది పేరు అందుకనే రామయ్య ని ఏదైనా అవసరమైన సందర్భంలో చంద్రబాబు బాగా ఇన్వాల్వ్ చేస్తారు.

 They Called Ntr’s Daughter Beggar-TeluguStop.com

చంద్రబాబు ని పోలవరం విషయం లో విమర్శించిన పురందరేశ్వరి కి చుక్కలు చూపించారు రామయ్య.ఎప్పుడు పురందరేశ్వరి ఏమన్నా సరే ఎంతైనా ఎన్టీఆర్ కూతురు కాబట్టి కాస్త సైలెంట్ గా ఉంటారు తెలుగు తమ్ముళ్ళు.

కానీ డైరెక్ట్ బాబు ని తీవ్రంగా విమర్శించడం తో వర్లా రామయ్య ఇక రెచ్చిపోయారు.అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడానికి పోలవరానికి అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడానికి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని పురందేశ్వరి విమర్శించిన సంగతి తెలిసిందే.

ఆమె ఆ విమర్శలు చేయగానే టీడీపీ నేతలు ఆమెపై విరుచుకుపడ్డారు.గోరంట్ల బుచ్చయ్యచౌదరి – వర్ల రామయ్యలు పురందేశ్వరిపై ఒంటి కాలితో లేచారు.

కొత్త బిచ్చగత్తె అవాకులు చెవాకులు పేలుతోందంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.బీజేపీలో పురందేశ్వరి కొత్త బిచ్చగత్తెలా తయారైందని బుచ్చయ్యచౌదరి విమర్శించారు.

పురందేశ్వరికి ఇంగితజ్ఞానం లేదని కూడా అనేశారు.పోలవరం అంచనా వ్యయం 30 వేల కోట్లకు పైగా ఎందుకు పెరిగిందో తెలియదా అని ప్రశ్నించారు.

కేంద్రంతో పోరాడడం చేతగాక తమపై నిందలు వేస్తారా అని బుచ్చయ్యచౌదరి ఆవేశంతో ఊగిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube