ఏపీ లో రాజకీయాలు నిమిషా నిమిషానికీ వేడి ఎక్కుతున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్ అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమం మంచి రంజుగా సాగుతోనిడ్.
రెండు రోజులకి ఒకరిద్దరు చొప్పున టీడీపీ సైకిల్ ఎక్కేస్తూ ఉంటే జగన్ మోహన్ రెడ్డికి ఏమీ ఆర్ధం కాని పరిస్థితి.మొన్నటి వరకూ వైకాపా నేత మణి గాంధీ సైకిల్ ఎక్కుతారు అని ప్రచారం జరిగింది.
కొద్ది సేపటి క్రితం ఆయన టీడీపీ లో జేరిపోయారు కూడా.ఆయన ఏపీ అధికారపక్షంలోకి చేరే కార్యక్రమానికి కర్నూలు జిలలాకు చెందిన ముఖ్యనేత కేఈ కృష్ణమూర్తితో పాటు.
మంత్రులు యనమల.అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఎమ్మెల్యే మణిగాంధీకి పచ్చ కండువా కప్పటం ద్వారా చంద్రబాబు ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు.తాజాగా సైకిల్ ఎక్కిన మణిగాంధీతో.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.ఇదంతా పది రోజుల వ్యవధిలో జరగటం గమనార్హం.
డజన్ కు పైగా జగన్ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారన్న అంచనాకు తగ్గట్లే చేరికల జోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది.







