పక్కా కమర్షియల్‌ అంటూ సెన్సార్‌ రిపోర్ట్‌ వచ్చిందట

గోపీచంద్‌ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్‌ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది.ఈ వారం లో విడుదల కాబోతున్న పక్కా కమర్షియల్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

 Gopichand Movie Pakka Commercial Sensor Talk , Flim News, Gopichand, Gopichand M-TeluguStop.com

గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా యాక్టివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా స్టార్‌ చిరంజీవి హాజరు అవ్వడం తో పాటు ప్రభాస్ ముచ్చట్లతో పక్కా కమర్షియల్‌ సినిమా గురించి తెగ ప్రచారం జరుగుతోంది.

పక్కా కమర్షియల్‌ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు.ఈయన గత సినిమా ల దృష్ట్యా ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి కమర్షియల్‌ మూవీగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతూ వచ్చారు.

తాజాగా ఈ సినిమా కు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

ఈ సినిమా కు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్‌ ను ఇవ్వడం జరిగింది.

ఇదే సమయంలో సెన్సార్‌ బోర్డ్‌ నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమా కు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.సెన్సార్‌ బోర్డు సభ్యులు సినిమా లోని ఎంటర్‌ టైన్మెంట్‌ ను బాగా ఎంజాయ్‌ చేశారట.

అంతే కాకుండా సినిమా లో డైలాగ్స్ మరియు గోపీచంద్‌ యొక్క పాత్ర బాగుంది అంటూ కామెంట్స్‌ వచ్చాయి.మొత్తానికి పక్కా కమర్షియల్‌ సినిమా ఒక మంచి పక్కా కమర్షియల్‌ గా ఉందంటూ వారి నుండి టాక్‌ వచ్చిందట.

బన్నీ వాసు ఈ సినిమా ను నిర్మించడంతో అంచనాలు మరింతగా ఉన్నాయి.అల్లు వారి కాంపౌండ్ మూవీ అంటే మినిమం ఉంటుంది.అల్లు అరవింద్ ప్రతి ఒక్క విషయం లో ఇన్వాల్వ్‌ అవుతారు.కనుక ఆయన సినిమా అంటే ఖచ్చితంగా బాగుంటుంది.

అందుకే తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube