వినియోగదారులకు వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతపై గూగుల్ దృష్టి సారించింది.ఈ క్రమంలో ప్లే స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ చేసే యాప్‌లపై వేటు వేసింది.
నిబంధనలు మార్చడంతో అవన్నీ ఇక నుంచి గూగుల్ ప్లేస్టోర్‌లో కనిపించవు.మే 11 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు కానుంది.
దీంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్‌కు గూగుల్ తీసుకున్న నిర్ణయం కోలుకోలేని దెబ్బ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా, దీనిని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటున్నాయి.
ముఖ్యంగా యూజర్ల ప్రైవసీ కాల్ రికార్డింగ్ యాప్‌ల వల్ల ప్రమాదం ఉందని గూగుల్ భావించింది.గతం నుంచి ఈ యాప్‌లపై గూగుల్ ఓ కన్నేసి ఉంచేది.తాజా నిర్ణయంతో వాటన్నింటినీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో ఆన్‌లైన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇతర యాప్‌ల సాయంతో వాటిని రికార్డ్ చేయడం కుదరదు.
యూజర్లు వాడుతున్న ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా ఉండే కాల్ రికార్డింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.అంతేకాకుండా గూగుల్ డయలర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఇలా చేస్తే అవతలి వారికి మీరు కాల్ రికార్డింగ్ చేస్తున్నారనే నోటిఫికేషన్ వెళ్తుంది.

థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్‌లను వినియోగించేటప్పుడు గూగుల్ యాక్సెసబిలిటీ ఏపీఐను ఉపయోగించాల్సి ఉంటుంది.దీని ద్వారా కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసి, వినియోగించుకోవచ్చు.దీనిని ఉపయోగించుకుని కాల్ రికార్డింగ్ యాప్‌లు సేవలను అందిస్తున్నాయి.
వీటి వల్ల ఉపయోగాలు కంటే అనర్థాలే ఎక్కువ ఉన్నాయని గూగుల్ గ్రహించింది.ఇక నుంచి ఏపీఐ యాక్సెస్‌ను తొలగించింది.
ఫలితంగా కాల్ రికార్డింగ్ యాప్‌లు పని చేయవు.అలాంటి యాప్‌లను ప్లే స్టోర్ నుంచి కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ కారణంగా మే 11 నుంచి ప్లే స్టోర్‌లో ఈ యాప్‌లు కనిపించవు.







