ప్రపంచం మొత్తం గూగుల్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇంటర్నెట్ రంగంలోనే గూగుల్ సంచలనంగా చెప్పుకోవచ్చు.
ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ వాడుతున్నారు అంటే అది కేవలం గూగుల్ వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.గూగుల్‌లో తెలిసి తెలియక ఏం కొట్టినా కూడా వచ్చేస్తుంది.
ఏ విషయం గురించి గూగుల్‌ను అడిగినా కూడా వేలకొద్డి ఆన్సర్‌లు, లక్షల కొద్ది రిజల్ట్స్ ఇస్తుంది.అంతటి ప్రాచుర్యం దక్కించుకున్న గూగుల్ కొన్ని సార్లు తప్పులు చేస్తుంది.
అయితే అది మానవ తప్పిదం వల్లే అని చెప్పుకోవచ్చు.

కొన్ని సార్లు ఒకటి వెదికితే మరోటి చూపిస్తుంది.ప్రస్తుతం గూగుల్ లో ఇడియట్ అంటూ సెర్స్ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి వస్తుంది.గతంలో పప్పు అని సెర్చ్ కొడితే వందల కొద్ది రాహుల్ గాంధీకి సంబధించిన విషయాలు వచ్చేవి.
రాహుల్ గాంధీ విషయాన్ని పెద్దగా పట్టించుకోని జనాలు డొనాల్డ్ ట్రంప్ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు.ఇడియట్ అంటే ట్రంప్ రావడంను అమెరికా అధికార వర్గాల వారు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

గూగుల్‌లో ఇలాంటి ఫలితం రావడంతో వైట్ హౌస్ వర్గాల వారు తీవ్ర ఆక్షేపణ చేస్తున్నారు.ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా గూగుల్ సంస్థకు ప్రభుత్వ వర్గాల వారు నోటీసులు ఇచ్చారు.గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా హౌస్ జ్యుడీషియల్ ముందు హాజరు అయ్యాడు.ఆ సందర్బంగా గూగుల్‌లో ఎందుకు ఇడియట్ అని కొడితే ట్రంప్ ఫొటో వస్తుందని ప్రశ్నించారు.
అందుకు ఆయన సమాధానం ఇచ్చాడు.

సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.ఇంటర్నెటల్‌లో ఎవరి వ్యక్తిగత విషయాలు వారు రాసుకుంటూ కొన్ని కోట్ల వ్యాసాలు, న్యూస్‌లు ఉంటాయి.వాటన్నింటితో గూగుల్‌కు సంబంధం లేదు.
గూగుల్‌లో ఏ విషయం కనిపించినా సదరు వెబ్ సైట్‌కు సంబంధించినదిగా తాము ముందు నుండి చెబుతున్నాం.ఇప్పుడు కూడా చెబుతున్నాం.
గూగుల్‌లో ఇడియట్ అని కొట్టగానే వచ్చే ఫొటోలు కూడా తాము కాని తమ కంపెనీ వారు కాని పోస్ట్ చేసినవి కావు.అందువల్ల వాటితో మాకు సంబంధం లేదు అంటూ సుందర్ పిచాయ్ మైండ్ బ్లోయింగ్ సమాధానం ఇచ్చాడు.
మామూలుగా అయితే వాటిని గూగుల్‌లో హైడ్ చేసే అవకాశం ఉంటుందట.కాని ట్రంప్ విధాలకు విసిగి పోయిన గూగుల్ దాన్ని కంటిన్యూ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.







