మీడియాలో ఏదో ఒక మూలన పదే పదే రైలు పట్టాలు దాటుతుండగా ఏనుగును ఢీ కొట్టిన రైలు అంటూ చదువుతూనే ఉంటాం.గత కొన్ని సంవత్సరాల కాలంలో వందల సంఖ్యలో ఏనుగులు రైలు పట్టాలపై పడి మృతి చెందిన విషయం తెల్సిందే.
దాంతో అటవి శాఖ మరియు రైల్వే శాఖలు కలిసి ఇనుప కంచెలను ఏర్పాటు చేయడం జరిగింది.ఆ కంచెల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
తాజాగా ఆ కంచెవల్లే ఒక ఏనుగు మృతి చెందడం జరిగింది.

కర్ణాటకలోని నాగర్ పార్క్ సమీపంలో 42 ఏళ్ల మగ ఏనుగు దారి తప్పి ఊర్లోకి వచ్చింది.జనాలు భయంతో ఆ ఏనుగును అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు.ఆ సమయంలో ఏనుగు ఉరుకులు పరుగులతో అడవిలోకి పరుగు పెట్టింది.
ఆ సమయంలోనే ఒక రైల్వే ట్రాక్ దాటాల్సి ఉంది.ఏనుగులు రైల్వే ట్రాక్ దాటకుండా ఉండేందుకు అటవి శాఖ వారు ఇనుప కంచను ఏర్పాటు చేయడం జరిగింది.
వేగంగా పరుగు పరుగున వచ్చిన ఏనుగు ఇనుప కంచెను దూకేందుకు ప్రయత్నించింది.

రెండు కాళ్లు అవతలికి వేయగలిగిన ఏనుగు మరో రెండు కాళ్లను వేయలేక పోయింది.ఆ పొజీషన్‌లో ఏనుగు దాదాపు పావు గంట తీవ్రంగా నరకయాతన అనుభవించింది.చుట్టు పక్కల జనాలు ఆ ఏనుగు బాధను చూడలేక పోయారు.
కాని ఏం చేయలేని పరిస్థితి.ఆ ఏనుగును ఎలా కాపాడాలో తెలియక జనాలు అలాగే చూస్తూ ఉండి పోయారు.

ఏనుగు ఊపిరి తీసుకోకుండా ఎక్కువ సమయం ఉండలేదు.చాతి బాగంలో ఎక్కువ సమయం ఒత్తుకుని ఉండటంతో ఏనుగు కొద్ది సమయంకు మృతి చెందింది.కంచెల ఎత్తు తక్కువ ఉంటం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏనుగు మరణంకు కారణం అయ్యిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనాలు మరియు ప్రభుత్వం కలిసి ఏనుగు మృతికి కారణం అయ్యారు అంటూ జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.చనిపోయిన ఏనుగును క్రేన్ ద్వారా అక్కడ నుండి తొలగించి ఖననం చేయడం జరిగింది.







