అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్-2..బోణి కొట్టిన కోస్టల్ రైడర్స్..!

విశాఖపట్నంలోని వైయస్సార్ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఎపీఎల్)-2( APL-2 ) బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

సినీనటి శ్రీలీల ( Sreeleela ) గౌరవ అతిథిగా హాజరై సందడి చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.కోస్టల్ రైడర్స్- బెజవాడ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ తో ఎపీఎల్-2 ప్రారంభం అయింది.

ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన బెజవాడ టైగర్స్( Bejawada Tigers ) బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడిన కోస్టల్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్లు నిరాశ పరిచిన మిడిల్ ఆర్డర్ ప్రేయర్లు స్కోరును పెంచుకుంటూ ముందుకు సాగారు.చివరలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు పి.మనోహర్, ఎల్.రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ ఆడి 16 బంతుల్లో 26 పరుగులు చేశారు.

Advertisement

దీంతో కోస్టల్ రైడర్స్ 149 పరుగులు నమోదు చేయగలిగింది.బెజవాడ టైగర్స్ బౌలర్ల లో కే.సాయి తేజ( K Sai Teja ) 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు.

మోహన్( Mohan ) 4 ఓవర్లకు మూడు వికెట్లు తీసి 30 పరుగులు ఇచ్చాడు.అనంతరం లక్ష్య చేదనకు దిగిన బెజవాడ టైగర్స్ 137 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

బెజవాడ టైగర్స్ మిడిల్ ఆర్డర్లో ఎం.అభినవ్ 44 బంతుల్లో మూడు సిక్స్లు, ఆరు ఫోర్ లతో 57 పరుగులు చేశాడు.

మిగిలిన బెజవాడ బ్యాటర్లు పరుగులు చేయలేక చేతులు ఎత్తేయడంతో 12 పరుగుల తేడాతో బెజవాడ టైగర్స్ ఓటమిని చవిచూసింది.కోస్టల్ రైడర్స్ బౌలర్ అయిన మనోహర్, ఆశిష్, కె.సుదర్శన్, స్టీఫెన్ లు చెరో రెండు వికెట్ల చొప్పున 8 వికెట్లు తీశారు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

మనోహర్ 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.కోస్టల్ రైడర్స్ ఈ లీగ్ ను బోణి కొట్టి ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు